యాప్నగరం

Mahesh Babu: ప్రకాశ్ రాజ్ డిస్కవరీ వైల్డ్‌ ప్రోమోపై మహేష్ రియాక్షన్

మహేష్ బాబు-ప్రకాష్ రాజ్ కాంబినేషన్ మూవీలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ ఇద్దరు మధ్య ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Samayam Telugu 27 May 2020, 11:06 am
ప్రకృతిలోని రమణీయతకు దృశ్యరూపం డిస్కవరీ. అడవులు, ఎడారుల్లోని వివిధ రకాల జంతువులు, చెట్లు, పక్షులు, పాములు జీవరాసులు సంబంధించిన అద్భుతమైన విజువల్స్‌ని కళ్లకు కట్టినట్టు చూపించే డిస్కవరీ అన్ని భాషల్లోకి విస్తరిస్తోంది. దీనిలో భాగంగా ఆయా ప్రాంతీయ భాషల్లో పాపులర్ నటీనటులతో డబ్బింగ్ చెప్పిస్తూ డిస్కవరీ వైల్డ్ లైఫ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Samayam Telugu మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ (Mahesh And Prakash Raj)
Mahesh Babu And Prakash Raj


తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. వైల్డ్ కర్ణాటక పేరుతో డిస్కవరీ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. జూన్ 5 శుక్రవారం రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ‘ఒకే అరణ్యంలో ఉండే.. అనేక రకాల జంతు సంపద కథ’ అంటూ వాయిస్ ఓవర్ అందించారు ప్రకాష్ రాజ్.

తెలుగు, కన్నడ భాషల్లో ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్స్ అందిస్తూ.. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను ట్విట్టర్‌లో విడుదల చేయడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ‘ప్రకాష్ రాజ్ గారూ.. మీ ఆసక్తికరమైన కథనం కోసం ఎదురు చూస్తున్నాము’ అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.