యాప్నగరం

Superstar Krishna పై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్.. లవ్ యూ నాన్న

Superstar Krishna అస్థికల్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేసిన మహేష్ బాబు.. రెండు రోజుల వ్యవధిలోనే ఎమోషనల్ ట్వీట్ చేశాడు. అందులో మీ వారసత్వాన్ని నేను ముందుకు తీసుకెళ్తానని వాగ్దానం చేయడంతో పాటు.. మిమ్మల్ని గర్వపడేలా చేస్తానంటూ కూడా ప్రామిస్ చేశాడు. జీవితాంతం డేరింగ్, డ్యాషింగ్ నిర్ణయాలతో మాకు స్ఫూర్తిగా నిలిచారంటూ కొనియాడుతూనే తనలోనూ ఆ స్ఫూర్తి నింపాడంటూ గుర్తు చేసుకున్నారు. ఓవరాల్‌గా లవ్ యూ నాన్న.. నా సూపర్ స్టార్ అంటూ?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 24 Nov 2022, 4:40 pm

ప్రధానాంశాలు:

  • మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్
  • ఈ నెల 15న చనిపోయిన సూపర్ స్టార్ కృష్ణ
  • గత సోమవారం అస్థికల్ని కృష్ణా నదిలో కలిపిన మహేష్ బాబు
  • వారసత్వాన్ని కొనసాగిస్తానంటూ ప్రామిస్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Mahesh Babu, Superstar Krishna,
మహేష్ బాబు ఎమోషనల్
సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) ఈ నెల 15న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగగా.. గత సోమవారం కృష్ణా నదిలో అస్థికలను మహేష్ బాబు (Mahesh Babu) నిమజ్జనం చేశారు. కృష్ణ చనిపోయినప్పటి నుంచి మీడియాతో పాటు సోషల్ మీడియాకీ దూరంగా ఉన్న మహేష్ బాబు ఈరోజు ఎమోషనల్‌గా కృష్ణని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు.
‘‘మీరు జీవితాన్ని వేడుకలా గడిపారు. ఇక్కడి నుంచి అంతకంటే వేడుకగా వెళ్లారు. అది మీ గొప్పతనం. డేరింగ్, డ్యాషింగ్ మీ తత్వం.. వాటితోనే మీరు నిర్భయంగా గడపగలిగారు. నా స్ఫూర్తి, నా ధైర్యం.. అన్నీ మీతో పాటే వెళ్లిపోయినట్లు అనిపిస్తోంది. కానీ చిత్రంగా నాలో ఆ బలాన్ని ఇప్పుటికీ నేను అనుభవిస్తున్నా. ఇలా నేను ఇంతకముందు ఎప్పుడూ అనుభవించలేదు. మీలాగా నేను కూడా ఇప్పుడు నిర్భయంగా ఉన్నాను. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇక్కడి నుంచి మీ వారసత్వాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. మిమ్మల్ని గర్వపడేలా చేస్తా. లవ్ యూ నాన్నా. నా సూపర్ స్టార్’’ అని మహేష్ బాబు ట్వీట్ (Mahesh Babu Tweet) చేశాడు. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిర కూడా ఈ ఏడాదే చనిపోయిన విషయం తెలిసిందే.

బాల నటుడిగానే వెండితెరపై మెరిసిన మహేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి చాలా సినిమాల్లో నటించాడు. అప్పట్లో మహేష్ బాబు సెట్‌లో ఏదైనా తప్పు చేస్తే? డైరెక్ట్‌గా కృష్ణ దిద్దుకోమని చెప్పేవాడు కాదట. మహేష్ భయపడతాడేమో అని రైటర్ పరుచూరి గోపాలకృష్ణకి చెప్పి అతనితో చెప్పించేవాడట. ఈ విషయాన్ని కృష్ణ చనిపోయిన రోజు పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో కృష్ణ మెమోరియల్‌ని మహేష్ బాబు ఏర్పాటు చేయబోతున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అలానే సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్‌ పేరిట ఏటా సినీ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి అవార్డ్ ఇవ్వాలని ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చరమాంకానికి చేరుకోగా.. హీరోయిన్ పూజా హెగ్డే గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసిన విషయం తెలిసిందే.

రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.