యాప్నగరం

Mahesh Babu: బ్లాక్‌బస్టర్‌కు రెడీగా ఉండండి.. SSMB 28 రిలీజ్ డేట్ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ SSMB 28. త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్. త్వరలోనే షూటింగ్ మొదలవ్వనుండగా.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్.

Authored byAshok Krindinti | Samayam Telugu 18 Aug 2022, 5:42 pm
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబో వస్తున్న మూవీ SSMB 28. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు బ్లాక్‌బస్టర్ హిట్‌కు రెడీగా ఉండాలని ఫ్యాన్స్‌కు చెప్పారు. SSMB 28 విడుదల తేదీ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. నెట్టింట ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
Samayam Telugu SSMB 28 Release date
SSMB 28 Release date


SSMB 28 మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ‌(చిన‌బాబు) నిర్మించనున్నారు. పూజాహెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. రెగ్యులర్ షూటింగ్‌పై త్వరలోనే అప్‌డేట్ ఇవ్వనుంది మూవీ యూనిట్.

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. అతడు మూవీ హిట్‌గా సాధించగా.. ఖలేజా సినిమా పెద్దగా ఆడియన్స్‌కు నచ్చలేదు. మళ్లీ దాదాపు పుష్కరకాలం తరువాత ఈ క్రేజీ కాంబో సెట్ కావడంతో SSMB 28 మూవీపై అభిమానులకు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా.. అలాగే కళా దర్శకుడిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడిగా పీఎస్ వినోద్, మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.