యాప్నగరం

Supritha Interview: మా అమ్మకి మళ్లీ పెళ్లి చేస్తా.. టైం డిసైడ్ చేస్తుంది: సురేఖా వాణి కూతురు

Surekha Vani Daughter: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో సురేఖా వాణికి మంచి క్రేజ్ ఉంది. అక్కగా, వదినగా, అమ్మగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.. తనదైన కామెడీ టైమింగ్‌తో, ఆకర్షించే అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Samayam Telugu 26 Feb 2022, 1:23 pm
సింగర్ సునీత పెళ్లి తరువాత టాలీవుడ్‌లో ఉన్న చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు పెళ్లి వార్తల్లో నిలిచారు. వారిలో సురేఖావాణి ఒకరు. మూడేళ్ల క్రితం భర్త చనిపోవడంతో సురేఖా వాణి కూతురు సుప్రితతో కలిసి ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండటంతో పాటు.. పొట్టి పొట్టి డ్రెస్‌‌లతో కూతురికి పోటీగా నిలుస్తున్న సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఇందులో నిజం లేదని.. అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు తల్లీకూతుళ్లు.
Samayam Telugu సురేఖ వాణి, సుప్రిత
surekha vani daughter supritha


అయితే తాజా ఇంటర్వ్యూలో తన తల్లి పెళ్లిపై ఓపెన్ అయ్యింది సుప్రిత. ఖచ్చితంగా తన తల్లికి పెళ్లి చేయాలనే ఉందని మనసులో మాట చెప్పింది. సుప్రిత మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో పూర్తిగా అమ్మదే నిర్ణయం. నాకైతే అమ్మకి పెళ్లి చేయాలని ఉంది.. ఖచ్చితంగా అమ్మకి పెళ్లి చేస్తేనే బాగుంటుందని నాకైతే ఉంది. అయితే ఏం జరుగుతుందన్నది టైం డిసైడ్ చేస్తుంది. నాన్న చనిపోయి మూడేళ్లు అవుతుంది.. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతుంది. అమ్మ తన కెరియర్ కంటే కూడా నా కెరియర్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది.

నాకు అమ్మ ఏది చెప్తే అది. తను ఏం చెప్తే అదే చేస్తున్నా. నా నిర్ణయాన్ని కూడా గౌరవిస్తుంది. మా ఫ్యామిలీలోకి బ్యాక్ బోన్ మా అమ్మే.. చిన్నప్పటి నుంచి కూడా అంతే. మా డాడీ ఉన్నాసరే అమ్మ ప్రతిదీ చేసుకునేది. డాడీ ఛానల్స్ మారేటప్పుడు కొన్నాళ్ల పాటు ఉద్యోగం ఉండేది కాదు.. అప్పుడు అమ్మే అన్నీ చూసుకునేది.. చిన్న చిన్న పాత్రలు చేసి ఫ్యామిలీని చూసుకునేది. మేం ఇలా ఉన్నాం అంటే అమ్మ వల్లే.. మా గురించే ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ.. నాన్న చనిపోయిన తరువాత అమ్మపై చాలామంది చాలా దారుణంగా కామెంట్లు పెట్టారు. అమ్మ ఎంత బాధపడిందో నాకు తెలుసు. అందుకే ఆ కామెంట్లు నేను చూడను.. అమ్మని కూడా చూడొద్దని చెప్తుంటాను. నాన్న చనిపోయిన బాధ నుంచి రిలీఫ్ ఉంటుందని అమ్మని పార్టీకి తీసుకుని వెళ్తే దానిపై కూడా కామెంట్లు చేశారు.. బాధలేదు.. బాధ్యత లేదు అన్నారు.. ఆ తరువాత అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంటుందని అన్నారు.. మేం ఎంత బాధపడ్డామో మాకు మాత్రమే తెలుసు’’ అంటూ చెప్పుకొచ్చింది సుప్రిత.

Read Also:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.