యాప్నగరం

చిరు-సురేందర్ రెడ్డి మూవీ కథ అదే!

మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేశారు. రీఎంట్రీలోనే 'ఖైదీ నెంబర్ 150' తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టారు.

TNN 25 Jan 2017, 10:10 pm
మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేశారు. రీఎంట్రీలోనే 'ఖైదీ నెంబర్ 150' తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టారు. ముందుగా సురేందర్ రెడ్డి, అలానే బోయపాటి శ్రీనులతో కలిసి పని చేయనున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోయే చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించనున్నారు.
Samayam Telugu surender reddy wants entertaining story for chiru next movie
చిరు-సురేందర్ రెడ్డి మూవీ కథ అదే!


అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి 'ఉయ్యలవాడ నరసింహారెడ్డి' కథను సినిమాగా చేయాలనుకుంటునట్లుగా వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం ఆ కథను డైరెక్ట్ చేయబోయేది సురేందర్ రెడ్డి అని తెలుస్తోంది. పరుచూరి బ్రదర్స్ సిద్ధం చేస్తోన్న ఈ స్క్రిప్ట్ పనులు పూర్తి కాగానే కథను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

యాక్షన్ ఫిల్మ్స్, కమర్షియల్ ఎంటర్టైనర్స్‌ను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన సురేందర్ రెడ్డి ఈ హిస్టారికల్ ఫిల్మ్‌ను కూడా హ్యాండిల్ చేయగలడని మెగా క్యాంప్ నమ్ముతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే షూటింగ్ మొదలుపెట్టి 2018 వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.