యాప్నగరం

తండ్రీ కొడుకులుగా సూర్య.. వైరల్ అవుతున్న కొత్త గెటప్

జల్లికట్టు నేపథ్యంలో సాగే కథతో సూర్య హీరోగా తెరకెక్కుతున్న వాడివాసల్‌ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఆయన లుక్ వైరల్ అవుతోంది.

Samayam Telugu 20 Oct 2020, 10:39 am
విలక్షణమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్ చేస్తుంటారు తమిళ నటుడు సూర్య. అందుకే ఆయనకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. త్వరలోనే ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన మరో సినిమాకు ఓకే చెప్పారు. తమిళుల సాహస క్రీడ జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కనున్న ‘వాడివాసల్‌’ చిత్రంలో సూర్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు.
Samayam Telugu సూర్య న్యూ గెటప్


Also Read: ఆ రీమేక్‌కు నో చెప్పిన పవన్‌ కళ్యాణ్!

ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో గ్రామీణ జల్లికట్టు క్రీడాకారుడి పాత్రలో సూర్య కనిపించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఆయన తన గెటప్ మార్చుకున్నారు. గడ్డం, పొడవైన మీసాలతో పాటు జుట్టు దట్టంగా పెంచుకుని గ్రామీణ జల్లికట్టు కీడ్రాకారుడిని తలపిస్తున్నారు. సూర్య గెటప్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: మూడో భర్తను తన్ని తరిమేసిన ప్రముఖ నటి.. ముందే ఊహించానన్న నిర్మాత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.