యాప్నగరం

క్రేజీ ప్రాజెక్ట్‌ను అంగీకరించిన సూర్య!

తమిళ నటుడు సూర్యకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన చిత్రాలన్నీ తెలుగులోకి అనువాదం అవుతూ ఉంటాయి.

TNN 13 Dec 2017, 7:01 pm
తమిళ నటుడు సూర్యకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన చిత్రాలన్నీ తెలుగులోకి అనువాదం అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న తమిళ చిత్రం ‘తానా సెర్న్‌ధ కూట్టం’ అనే సినిమా తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో విడుదల కాబోతుంది. ఈ సినిమా తరువాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో సూర్య పాల్గొంటాడు. అయితే తాజాగా ఈ హీరో మరో క్రేజీ ప్రాజెక్ట్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దర్శకుడు కేవీ ఆనంద్ వినిపించిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ టాక్.
Samayam Telugu suriya once again to team up with kv anand
క్రేజీ ప్రాజెక్ట్‌ను అంగీకరించిన సూర్య!


గతంలో సూర్య, కేవీ ఆనంద్ కాంబినేషన్‌లో ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్’ సినిమాలు వచ్చాయి. ఈ చిత్రాలకు ప్రేక్షకాదరణ లభించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పని చేయడానికి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ఆగస్ట్ నెలలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్‌ ‘2.0’ సినిమాను నిర్మిస్తోంది. అలాగే కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, ఇళయదలపతి విజయ్‌తో మరో సినిమాను ఇదే బ్యానర్‌లో నిర్మించనున్నారు. సూర్యతో లైకా ప్రొడక్షన్స్ చిత్రంపై త్వరలోనే అధికార ప్రకటన వెలువడే అవకాశముంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.