యాప్నగరం

సింగం-3కి విడుదల ఆరోజే !

సూర్య నటించిన సింగం-3 చిత్రంపై ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే రాంచరణ్ 'ధృవ' సినిమా కోసం సింగం-3 సినిమాని డిసెంబర్ 23కు వాయిదా వేసినట్లు తెలిపారు. కానీ...

TNN 22 Dec 2016, 2:36 pm
సూర్య నటించిన సింగం1, సింగం2 చిత్రాలకి సీక్వెల్ సింగం-3 చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఒకసారి రాంచరణ్ నటించిన 'ధృవ' సినిమా కోసం సింగం-3 సినిమాని డిసెంబర్ 23కు వాయిదా వేసినట్లు తెలిపారు. కానీ తమిళనాడు సీఎం జయలిత మరణం, మరోవైపు వర్ద తుఫాను, నోట్ల రద్దు కష్టాలు తదితర కారణాల చేత సింగం మరోసారి వెనకడుగు వేయాల్సి వచ్చింది.
Samayam Telugu suriyas singam3 movie release date re announced
సింగం-3కి విడుదల ఆరోజే !


ఈ నేపథ్యంలో మరోసారి సింగం-3 సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సింగం-3 విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ వెల్లడించింది. ఈ సారి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, సింగం-3 వేట ఖాయమేనని చెప్తున్నారు. హేరీస్ జయరాజ్ సంగీతం అందించిన సింగం-3 ఆడియో డిసెంబర్ 10న విడుదలయింది.



హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన సింగం-3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో సూర్య సరసన అనుష్క శెట్టి, శృతిహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.