యాప్నగరం

అమెజాన్‌ బిగ్‌ ఎనౌన్స్‌మెంట్‌.. మెగా స్టార్‌.. మెగా మూవీ.. మెగా రిలీజ్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరు తనయుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మించిన ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమా మహాత్మ గాంధీ 150వ జయంతి కానుకగా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్‌ మార్కెట్‌ స్టామినాను మరోసారి ప్రూవ్‌చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కానుంది.

Samayam Telugu 20 Nov 2019, 3:19 pm
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరు తనయుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మించిన ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమా మహాత్మ గాంధీ 150వ జయంతి కానుకగా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్‌ మార్కెట్‌ స్టామినాను మరోసారి ప్రూవ్‌చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కానుంది.
Samayam Telugu sye raa narasimha reddy gets the amazon prime streaming date
అమెజాన్‌ బిగ్‌ ఎనౌన్స్‌మెంట్‌.. మెగా స్టార్‌.. మెగా మూవీ.. మెగా రిలీజ్‌


అమెజాన్‌ ప్రైమ్‌లో సైరా

ప్రస్తుతం సినిమాలకు డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలపై కూడా భారీ క్రేజ్‌ ఉంది. థియేటర్ల వరకు రాలేని ప్రేక్షకులు, ఇంట్లోనే సినిమా చూడాలనుకునే వారు డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలనే ఆశ్రయిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సినిమా రిలీజ్‌ అయిన 40, 50 రోజుల్లోనే అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా సైరా సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా అభిమానుల కోసం అమెజాన్‌ ప్రైమ్‌ శుభవార్త అందించింది. సైరా నరసింహారెడ్డి సినిమా రేపటి (21-11-2019) నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రేపే అమెజాన్‌ విడుదలవుతుండగా హిందీ వర్షన్‌ మాత్రం ఈ నెల 28న విడుదల కానుంది.

Twitter-sye raa narsimha reddy will release in tamil, telu...

సైరా నరసింహారెడ్డి కథ

మెగాస్టార్‌ నరసింహారెడ్డి పాత్రలో నటించేందుకు దాదాపు దశాబ్దకాలం పాటు ఎదురుచూశాడు. సిపాయిల తిరుగుబాటుకన్నా ముందు తెలుగు నేల మీద బ్రిటీష్ వారికి ఎదురుతిరిగిన వీరుడి కథను పరిచయం చేసేందుకు ఎదురుచూశాడు. 1800ల ప్రాంతంలో ఉయ్యాలవాడ పాలేగాడైన నరసింహారెడ్డి బ్రిటీష్ ప్రభువుల అరాచకాలకు ఎదురుతిరిగి చేసిన పోరాటమే నరసింహారెడ్డి కథ. అయితే ఒరిజినల్‌ కథ పెద్దగా అందుబాటులోకి లేకపోవటంతో ప్రచారంలో ఉన్న సంఘటనలకు సినిమాటిక్‌ టచ్‌ ఇస్తూ ఈ సినిమాను రూపొందించాడు సురేందర్‌ రెడ్డి.

తండ్రి కలను నేరవేర్చేందుకు

మెగాస్టార్‌ నరసింహారెడ్డి కథను వెండితెరకెక్కించేందుకు పదేళ్ల క్రితమే సంకల్పించాడు. అయితే అప్పట్లో బడ్జెట్‌ కారణంగా ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. అయితే తండ్రి కలను నేరవేర్చే బాధ్యతను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ తీసుకున్నాడు. బాహుబలి తరువాత తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ ఓపెన్‌ కావటంతో సైరా నరసింహారెడ్డి సినిమాను 250 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించాడు రామ్‌ చరణ్‌. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు సుధీప్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, లాంటి టాప్‌ స్టార్స్‌ను ఈ సినిమా కోసం తీసుకొచ్చాడు చరణ్‌.

సక్సెస్‌.. బిజినెస్‌

అయితే సైరా నరసింహారెడ్డి అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించిన ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆ స్థాయిలో వర్క్‌ అవుట్ కాలేదు. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ఏ మాత్ర ప్రభావం చూపించలేకపోయింది. బాహుబలి స్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తుందని ఆశించిన ఊసూరుమనిస్తూ ఉత్తరాది భారీ నష్టాలను మిగిల్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.