యాప్నగరం

ఉప రాష్ట్రపతి ఇంట్లో... సైరా స్పెషల్ షో!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాను ఢిల్లీలోని ప్రముఖుల కోసం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట్లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

Samayam Telugu 16 Oct 2019, 6:25 pm
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మెగా మూవీ సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్‌ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది.
Samayam Telugu Sye Raa
వెంకయ్య నాయుడుని కలిసిన చిరంజీవి


సినిమాను భారీగా ప్రమోట్‌ చేస్తున్న చిత్రయూనిట్‌ తాజాగా ఢిల్లీలో స్పెషల్‌ షోకు ఏర్పాట్లు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలిసి మెగాస్టార్‌ చిరంజీవి ఆయన ఇంట్లోనే స్పెషల్ షోకు ఏర్పాట్లుచేశారు. వెంకయ్య నాయుడుతో కలిసి చిరు కూడా సినిమాను వీక్షించనున్నారు.
Also Read: ఐరన్‌ మ్యాన్‌గా బాలయ్య.. కథ లేకుండానే టైటిల్ ఫిక్స్‌!

అంతేకాదు ప్రధాని నరేంద్రమోదితో పాటు అమిత్‌ షాను కూడా ఈ షోకు ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. అయితే షో ఎప్పుడు ఏర్పాటు చేయనున్నారు, ఎవరెవరు హాజరు కానున్నారు అన్న విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చిరు ఢిల్లీ పర్యటనలో ఆయనతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా పాల్గొనటం ప్రాధాన్యత సంతరించుకుంది.

మెగాస్టార్ చిరంజీవి నరిసింహారెడ్డి పాత్రలో నటించిన ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తండ్రి డ్రీమ్‌ ప్రాజెక్ట్ కావటంతో ఈ భారీ చిత్రాన్ని నిర్మించే బాధ్యతను చిరు తనయుడు రామ్‌చరణ్‌ స్వయంగా తీసుకున్నాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. బాలీవుడ్ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Also Read: దీపావళిని అలా వదిలేశారేంటి.. ఒక్క సినిమా కూడా లేదా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.