యాప్నగరం

శింబు తండ్రి తీరుతో..హీరోయిన్ ఆవేదన!

నటుడు శింబు తండ్రి, దర్శకనిర్మాత టి.రాజేందర్ తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది నటి

TNN 15 Nov 2017, 3:40 pm
నటుడు శింబు తండ్రి, దర్శకనిర్మాత టి.రాజేందర్ తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది నటి ధన్సిక. కబాలి తదితర సినిమాల్లో నటించిన ఈ నటీమణి.. రాజేందర్ తీరును తప్పు పట్టింది. రెండు నెలల కిందట జరిగిన ఒక వ్యవహారంపై ధన్సిక ఈ విధంగా స్పందించింది. అప్పట్లో ఒక సినిమా కార్యక్రమంలో ధన్సిక మాట్లాడుతూ.. వేదిక మీద ఉన్న అందరి పేర్లనూ ప్రస్తావించిందట, అయితే టీఆర్ పేరును మాత్రం ఆమె ప్రస్తావించడం మరిచిపోయిందట. దీంతో.. ఆయనకు కోపం వచ్చింది. అదే వేదిక మీదే మాట్లాడుతూ.. ధన్సికపై విరుచుకుపడ్డాడు. ఆమెను దూషించినంత పని చేశాడు.
Samayam Telugu t rajendar insults dhansika onstage reduces her tears
శింబు తండ్రి తీరుతో..హీరోయిన్ ఆవేదన!


చివరకు ధన్సిక అప్పటికప్పుడు స్పందించింది రాజేందర్ కు క్షమాపణలు చెప్పింది కూడా. అయినా.. ఆయన కూల్ కాలేదు. దీంతో.. అదొక వివాదంగా మారింది. ఆ వ్యవహారంపై నడిగర్ సంఘం తరఫు నుంచి నటుడు విశాల్ కూడా స్పందించాడు. ధన్సికను టీఆర్ క్షమించాల్సిందని విశాల్ అభిప్రాయపడ్డాడు. ఈ నేఫథ్యంలో టీఆర్ తీరుపై ధన్సిక స్పందిస్తూ.. ఆయన ఆ రోజు ప్రవర్తించిన తీరు తనను ఇప్పటికీ కలవర పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.

‘టీఆర్‌ను ఆధ్యాత్మిక వేత్త అని అందరూ అంటారు. అయితే ఆయన తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయారు. నాకు కూడా కోపం ఎక్కువే. అయితే అధ్యాత్మికతతో నేను దాన్ని తగ్గించుకున్నాను. టీఆర్ తీరు వల్ల నేను మానిసకంగా చాలా బాధపడ్డాను. వారం రోజుల పాటు తీవ్రంగా సతమతమయ్యాను. ఇది సమాజంలోని పురుషాధిక్యతకు నిదర్శనం. ఏ రంగంలో అయినా మహిళలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందేమో. టీఆర్ అలా మాట్లాడినప్పుడు నేను ఏడ్చేశా. ఇక ఆ సంఘటన గురించి మాట్లాడకూడదని అనుకుంటున్నాను.’అని ధన్సిక వ్యాఖ్యానించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.