యాప్నగరం

సూపర్‌స్టార్‌ను సస్పెండ్ చేయాల్సిందే: రేవతి

నిర్దోషిగా తేలే వరకు సూపర్ స్టార్‌ను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ నటీమణులు రేవతి, పద్మప్రియ, పార్వతిలు మరోసారి లేఖ రాశారు.

Samayam Telugu 6 Oct 2018, 10:23 pm
మలయాళ సూపర్ స్టార్, నటుడు దిలీప్‌ సభ్యత్వాన్ని కొనసాగిస్తారా లేదా అన్న అంశమై అక్టోబర్‌ 9లోగా తుది నిర్ణయాన్ని చెప్పాలని నటి రేవతి కోరారు. ఈ మేరకు అమ్మ (అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌)కు మూడోసారి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. గత ఏడాది షూటింగ్‌కు వెళ్లొస్తుండగా ప్రముఖ కేరళ నటిని కొందరు కిడ్నాప్ చేసి వేధిస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో దిలీప్ విచారణ ఎదుర్కొంటున్నారు.
Samayam Telugu revathy Padmapriy and Parvathy


వేధింపుల కేసులో క్లీన్‌చిట్ వస్తే అసోసియేషన్‌లోకి తీసుకోవాలని, నిందితులుగా ఉన్నవారిని ‘అమ్మ’లోకి ఆహ్వానించడాన్ని మహిళా ఆరిస్టులు, హీరోయిన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిర్దోషిగా తేలే వరకు దిలీప్‌ను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ నటీమణులు రేవతి, పద్మప్రియ, పార్వతిలు మరోసారి లేఖ రాశారు. అక్టోబర్ 7న కోచిలోని క్రౌన్ ప్లాజా హోటల్‌లో బాధితురాలికి మద్దతుగా కొందరు ఆర్టిస్టులు సమావేశం కానున్నారు. అయితే రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన కారణంగా కొన్నిరోజుల వరకు సమసిపోయినట్లు కనిపించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

బాధితురాలికి నిజంగా న్యాయం జరగాలంటే ఆమెకు మద్దతుగా నిలవడంతో తప్పు చేసిన వారిపై వేటు వేయాల్సిందేనని మరికొందరు ఆర్టిస్టులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, దిలీప్‌ను మూవీ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ‘అమ్మ’ నుంచి రీమా కల్లింగల్, గీతు మోహన్‌దాస్, రెమ్యా నంబీసాన్, వేధింపులకు గురైన హీరోయిన్ కొంతకాలం కిందట రాజీనామా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.