యాప్నగరం

​తమన్నాకు ‘డాక్టరేట్’..ఈ వయసుకేనా..!

హీరోయిన్లే కదా.. వీళ్లు స్కిన్ షో తప్ప మరేం చేస్తారు, గ్లామరస్ గా కనిపించడం మినహా ఇంకేం చేస్తారు.. అనుకోవద్దు.

TNN 25 Jul 2017, 7:58 am
హీరోయిన్లే కదా.. వీళ్లు స్కిన్ షో తప్ప మరేం చేస్తారు, గ్లామరస్ గా కనిపించడం మినహా ఇంకేం చేస్తారు.. అనుకోవద్దు. హీరోయిన్లను కూడా సినీరంగానికి సేవ చేస్తున్న వారి కిందే గుర్తించాలి...అంటోంది ఒక స్వచ్ఛంద సంస్థ. చాలా మంది సీనియర్ హీరోలకు డాక్టరేట్లు దక్కాయి. వివిధ వర్సిటీలు వాళ్లకు డాక్టరేట్లను ప్రదానం చేశాయి. అలాంటి వారి కన్నా చిన్న వయసులోనే తమన్నా డాక్టరేట్ పొందడం గమనార్హం. ‘కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌ కమిషన్‌’ అనే గుజరాతీ స్వచ్ఛంద సంస్థ తమన్నాకు డాక్టరేట్ ను ఇచ్చింది. ఇదొక అంతర్జాతీయ స్థాయి ఎన్జీవోనట.
Samayam Telugu tamanna becomes dr tamanna
​తమన్నాకు ‘డాక్టరేట్’..ఈ వయసుకేనా..!


దక్షిణాది సినీరంగానికి తమన్నా చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఆమెకు డాక్టరేట్ ను ఇచ్చినట్టుగా సదరు సంస్థ ప్రకటించింది. తన పద్నాలుగో యేటే తమన్నా హీరోయిన్ గా చేయడం మొదలుపెట్టింది. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా అంతగా ఆడకపోయినా.. ఆ తర్వాత తమన్నా కెరీర్ క్రమక్రమంగా పుంజుకుంది. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది. హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసింది.

ప్రస్తుతం కూడా చేతినిండా అవకాశాలతో, అడపాదడపా ఐటమ్ సాంగ్స్ తో తమన్నా కెరీర్ ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు డాక్టరేట్ దక్కింది. డాక్టర్ తమన్నా అయ్యింది. డాక్టరేట్ ను గౌరవప్రదంగా భావిస్తున్నాని తమన్నా చెప్పింది. ఈ గౌరవంతో తన బాధ్యత మరింత పెరిగిందని వివరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.