యాప్నగరం

ఆ సమయంలో చనిపోతా అనుకున్నా.. చాలా భయమేసింది! వాళ్లు చేసిన ఆ కామెంట్స్.. తమన్నా ఎమోషనల్

తనకు కరోనా సోకిన సమయంలో పడిన ఇబ్బందులు, ఆ తర్వాత కొంతమంది చేసిన కామెంట్స్ గురించిన వివరాలు తెలుపుతూ తీవ్ర భావోద్వేగం చెందింది తమన్నా.

Samayam Telugu 9 Nov 2020, 2:14 pm
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలకు, సామాన్య ప్రజలకు మధ్యదూరం చాలా వరకు తగ్గిపోయింది. అభిమానులతో టచ్‌లో ఉండటానికి సెలబ్రిటీలకు ప్రధాన అస్త్రం సామాజిక మాధ్యమాలు అయ్యాయి. కానీ కొన్ని సందర్భాల్లో నెటిజన్ల తీరు సెలబ్రెటీలకు ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఆయా విషయాలు తెలుపుతూ తీవ్ర భావోద్వేగం చెందింది.
Samayam Telugu ఆ సమయంలో చనిపోతా అనుకున్నా.. చాలా భయమేసింది!
Tamannaah


ఇటీవలే తమన్నా కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆమె.. తాజాగా కోవిడ్ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి, ఆ తర్వాత తన ఫోటోలు చూసి నెటిజన్స్ రియాక్ట్ అయిన తీరు గురించి వివరించింది. తనకు కరోనా సోకిందనే విషయం తేలియాగానే కంగారు పడ్డానని, పైగా తనలో కోవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో చనిపోతానేమో అని భయమేసిందని తమన్నా చెప్పింది. ఆ సమయంలో వైద్యులు సరైన ట్రీట్‌మెంట్ ఇచ్చి తనను కాపాడారని ఆమె పేర్కొంది.

Also Read: Chiranjeevi Coronavirus: చిరంజీవికి కరోనా.. టెన్షన్‌లో రామ్ చరణ్! మాస్క్ లేకుండా కనిపించడంతో అంతా పరేషాన్

ఇకపోతే కోవిడ్ సమయంలో తనకు అండగా నిలుస్తూ సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు, డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది తమన్నా. ఆ సమయంలోనే తనకు జీవితం విలువ తెలిసిందని చెప్పిన మిల్కీ బ్యూటీ.. కోవిడ్ నుంచి కోలుకున్నాక కొందరు నెటిజన్స్ చేసిన కామెంట్స్ తీవ్రంగా బాధపెట్టాయని తెలిపింది. కరోనా టైమ్‌లో ఎక్కువగా మందులు వాడటం వల్ల కాస్త బరువు పెరిగితే దాన్నే టార్గెట్ చేస్తూ కొందరు చేసిన కామెంట్స్ చిరాకు తెప్పించాయని తమన్నా చెప్పుకొచ్చింది.

రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేస్తే అది చూసి చాలా మంది లావుగా ఉన్నావని కామెంట్స్ పెట్టడం చూస్తే వాళ్ళ విజ్ఞత ఏంటనేది అర్థమవుతోందని తమన్నా వాపోయింది. పరిస్థితి ఎలాంటిది? అనేది తెలుసుకోకుండా కొంతమంది ఇలా మాట్లాడుతుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకరి గురించి కామెంట్ చేసేటప్పుడు కేవలం వారి లోపాలపైనే దృష్టి పెడతారని చాలా క్లియర్‌గా తెలిసిందంటూ తన బాధను వ్యక్తపరిచింది తమన్నా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.