యాప్నగరం

క్రికెటర్‌తో తమన్నా ఎఫైర్! ఇదిగో సాక్ష్యం.. అసలు మ్యాటర్ చూస్తే..

సోషల్ మీడియాలో వస్తున్న ఏ వార్తలు నమ్మాలో ఏవి నమ్మొద్దో అర్థంకాని పరిస్థితి నెలకొంది. తాజాగా తమన్నాపై ఓ రూమర్ క్రియేట్ కావడంతో ఆమె గట్టిగా ఇచ్చుకుంది.

Samayam Telugu 5 May 2020, 4:40 pm
పెరిగిన టెక్నాలజీ, దానికి తోడు సోషల్ మీడియా కొత్తపుంతలు తొక్కుతుండటం కొన్ని సందర్భాల్లో అనవసర చిక్కులు తెస్తోంది. ముఖ్యంగా హీరోయిన్స్ ఎఫైర్ తాలూకు విషయాలు ఇట్టే వైరల్ అవుతుండటం వాళ్లకు తలనొప్పిగా మారింది. ఓ హీరోయిన్ బయట ఎవరితో అయినా కనిపిస్తే చాలు నిజానిజాల సంగతి పక్కనబెట్టి రూమర్స్ అంటగడుతున్నారు గాసిప్ రాయుళ్లు. కనీసం ఆ పిక్ ఎక్కడిది? ఎప్పటిది? అని కూడా చూడకుండా ఒక్క క్లిక్‌తో వైరల్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సందర్భమే ఎదుర్కొన్న తమన్నా.. దానిపై ఘాటుగా రియాక్ట్ అయింది.
Samayam Telugu క్రికెటర్_తో తమన్నా ఎఫైర్
Tamanna


పాకిస్తాన్ క్రికెటర్‌తో కలిసి తమన్నా షాపింగ్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ పిక్ ఇప్పటిది కాదు. అప్పట్లో దుబాయ్‌లో ఓ బంగారం షాపు ప్రారంభోత్సవానికి పాకిస్థానీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైనప్పటిది. ఆ సమయంలో తీసిన ఫోటోను ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టేసి.. తమన్నా ప్రేమలో పడింది, పెళ్లి కూడా చేసుకోబోతోంది. అందుకే బంగారం కొనేందుకు వెళ్ళిందంటూ ప్రచారం స్టార్ట్ చేశారు.

Tamanna Abdul Razak

దీంతో ఈ ప్రచారంపై రియాక్ట్ అయిన తమన్నా.. ఇలాంటి వెర్రి పుకార్లను ఆపాలని, నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వైరల్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు ఎవరితో ఎలాంటి ఎఫైర్ లేదని, మరో రెండేళ్లలో తాను పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానని తమన్నా పేర్కొంది.

తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ కూడగట్టుకున్న తమన్నా.. అందరు అగ్ర హీరోల సరసన నటించింది. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో పార్టీ సాంగ్ చేసి హోరెత్తించింది. ప్రస్తుతం ఆమె గోపిచంద్ సరసన సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సీటిమార్' సినిమాలో నటిస్తోంది.

Also Read: చాలా రోజులుగా అడుగుతున్నా.. కానీ ఆయన!! ఆ రూమ్‌లోకి వస్తేగా: స్టార్ హీరోయిన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.