యాప్నగరం

Andhadhun Remake: టబు ప్లేస్ ఫిక్స్.. చివరకు తమన్నా చేతిలో పడిన పవర్‌ఫుల్ రోల్

'అందాదున్' తెలుగు రీమేక్‌లో పవర్‌ఫుల్ రోల్ కోసం తమన్నాను సెలక్ట్ చేశారు మేకర్స్. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన రిలీజ్ చేశారు. నితిన్, తమన్నా, నభా నటేష్ ఈ మూవీలో భాగం కానున్నారని తెలిపారు.

Samayam Telugu 19 Sep 2020, 4:19 pm
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'అందాదున్' తెలుగు రీమేక్‌లో తమన్నాను ఫైనల్ చేస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి నితిన్ హీరోగా ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, చెల్లెలు నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్ నభా నటేష్‌ని కన్ఫర్మ్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా తమన్నా కూడా ఇందులో భాగం కానున్నట్లు ప్రకటించింది.
Samayam Telugu Andhadhun Remake: చివరకు తమన్నా చేతిలో పడిన పవర్‌ఫుల్ రోల్
Tamannah Nithiin


ఒరిజినల్ వర్షన్‌లో రాధికా ఆప్టే పోషించిన రోల్ నభా నటేష్ చేయనుందని, అలాగే పవర్‌ఫుల్ టబు రోల్‌లో తమన్నా కనిపించనుందని తెలిపారు. 'అందాదున్' మూవీలో టబు పోషించిన పాత్ర సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ అయి మూవీ విజయంలో కీలకం అయింది. దీంతో ఈ రీమేక్‌లో కూడా ఆమెనే తీసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవడంతో ఆ రోల్ కోసం ఇలియానా, శ్రీయ, నయనతార, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్ల పేర్లు పరిశీలించి చివరకు తమన్నాను సెలక్ట్ చేశారు మేకర్స్.

Also Read: రష్మీ మనసు కరిగించిన నెటిజన్.. నీ అడ్రస్ చెప్పమంటూ జబర్దస్త్ బ్యూటీ రిప్లై! ఇదీ మ్యాటర్

డిమాండ్ ఉన్న పాత్ర, పైగా సినిమాలో కీలకమైన రోల్ కావడంతో తన వద్దకు ఈ అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పిందట తమన్నా. దీంతో ఇప్పటిదాకా గ్లామర్ రోల్స్ పోషించిన మిల్కీబ్యూటీ ఇప్పుడీ పవర్‌ఫుల్ రోల్ ఎలా డీల్ చేస్తుందనే ఆసక్తి నెలకొంది ప్రేక్షకుల్లో. కాగా ఈ సినిమాలో నటించాలంటే కాస్త భయంగా ఉందని, `అంధాదున్`లో హీరోగా నటించిన ఆయుష్మాన్‌ పాత్ర తనకు ఛాలెంజింగ్ రోల్ అని ఇటీవలే తెలిపాడు నితిన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.