యాప్నగరం

1002 చిత్రాల నటుడు, రచయిత మృతి

ప్రముఖ తమిళ నటుడు, రచయిత విను చక్రవర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. గత మూడేళ్లుగా ఆరోగ్య సమస్యలతో...

TNN 28 Apr 2017, 3:22 pm
ప్రముఖ తమిళ నటుడు, రచయిత విను చక్రవర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. గత మూడేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చక్రవర్తి గురువారం తుదిశ్వాస విడిచారు. 1002 చిత్రాల్లో నటించిన యాక్టర్‌గా విను చక్రవర్తికి పేరుంది. అందులో అత్యధిక చిత్రాలు తమిళంలో తెరకెక్కినవే. సౌతిండియాలో ఒకప్పుడు ఫేమస్ సెలబ్రిటీగా పేరున్న సిల్క్ స్మితను సినీపరిశ్రమకి పరిచయం చేయడంలో విను చక్రవర్తి కీలక పాత్ర పోషించారు.
Samayam Telugu tamil actor and writer vinu chakravarthy who introduced silk smitha is passed away
1002 చిత్రాల నటుడు, రచయిత మృతి


1945లో జన్మించిన విను చక్రవర్తి మొదట్లో ఓ కథా రచయితగా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత పుట్టన కనగల్ అనే ప్రముఖ కన్నడ దర్శకుడి వద్ద పనిచేశారు. ఆ తర్వాత 1977లో తొలిసారిగా తిరుపురు మణి అనే నిర్మాత కన్నడ చిత్రం పరసంగడ గెండెటిమ్మ అనే చిత్రం ద్వారా చక్రవర్తికి నటుడిగా అవకాశం కల్పించారు. అలా నటుడిగా మారాకా తమిళం, తెలుగు, కన్నడ, మళయాళం భాషా చిత్రాలన్నింటిలో కలిపి దాదాపు 1000కిపైగా చిత్రాల్లో నటించారు. జెమినీ గణేషన్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్రనటుల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

2014లో వచ్చిన 'వాయ మూడి పెసవం' అనే తమిళ చిత్రం చక్రవర్తి ఆఖరి సినిమా. ఆయనకి భార్య, ఓ కుమారుడు, కుమార్తే వున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.