యాప్నగరం

పవన్ కోసం మరో దర్శకుడు ప్రయత్నాలు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని కోరుకునే దర్శకులు చాలా మంది ఉన్నారు.

TNN 9 Jan 2017, 6:05 pm
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని కోరుకునే దర్శకులు చాలా మంది ఉన్నారు. కానీ
Samayam Telugu tamil director shiva prepared story for pawan kalyan
పవన్ కోసం మరో దర్శకుడు ప్రయత్నాలు!

అవకాశం మాత్రం కొందరికే వస్తుంది. తాజాగా మరో దర్శకుడు పవన్‌తో కలిసి పనిచేయాలని తపన పడుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. అజిత్‌కు వరుస హిట్స్ ఇస్తోన్న శివ. ‘వీరం’, ‘వేదాళం’ వంటి సినిమాలతో అజిత్ కెరీర్‌లో మంచి హిట్స్‌గా నిలిచిపోయే సినిమాలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆయనతో సినిమా చేసే పనిలోనే ఉన్నాడు.

అయితే పవన్ కోసం కూడా ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట ఈ యంగ్ డైరెక్టర్. పవన్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాలో నటించాల్సివుంది. అలానే ఆర్.టి. నీసన్ సినిమా కూడా లైన్‌లో ఉంది. మరి ఈ ప్రాజెక్ట్స్ పూర్తయిన తరువాతే పవన్ మరో సినిమా అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ చెప్పే కథ గనుక ఆయనకు నచ్చితే కచ్చితంగా సినిమాను పట్టాలెక్కించేస్తాడు. మరి కథ పవన్‌కు నచ్చుతుందో.. లేదో.. చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.