యాప్నగరం

ఆ హీరో ప్యూర్ వర్జిన్, ఫ్రెష్‌ : లైవ్‌లోనే నిస్సిగ్గుగా శ్రీరెడ్డి..

ప్రస్తుతం చెన్నైలో మకాం పెట్టిన శ్రీరెడ్డి.. తెలంగాణ ఎలక్షన్స్ సందర్భంగా ఫేస్ బుక్‌ లైవ్‌లోకి వచ్చింది. వచ్చీ రావడంతోటే నిస్సిగ్గుగా నోటికి పనిచెప్పింది.

Samayam Telugu 7 Dec 2018, 4:52 pm
శ్రీరెడ్డి ఫొటోతో వార్త వచ్చిందంటే మళ్లీ వచ్చింద్రా బాబూ.. ఈసారి ఏ కామెంట్స్ చేసిందో? ఎవర్ని టార్గెట్ చేసిందో? ఎవరిపై బూతు పురాణం మొదలుపెట్టిందని ఆసక్తిగా ఎదురుచూసే జనం చాలా మందే ఉన్నారు. ఆమె ఫేస్ బుక్‌ని 6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే ఆమెకున్న పాపులారిటీ ఏంటో ఓ అవగాహనకు వచ్చేయొచ్చు. అది కలిసొచ్చే పాపులారిటీనా.. మరేదైనానా? అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఖాతా ఓపెన్ చేసింది శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో నేషనల్ మీడియాలో సైతం హెడ్ లైన్స్‌లో నిలిచిన శ్రీరెడ్డి.. కాస్త విరామం అనంతరం తన పాత పద్దతికి వచ్చేసింది.
Samayam Telugu శ్రీరెడ్డి


View this post on Instagram A post shared by Sri Reddy Mallidi (@srireddymallidi) on Feb 10, 2018 at 9:08pm PST

ప్రస్తుతం చెన్నైలో మకాం పెట్టిన శ్రీరెడ్డి.. తెలంగాణ ఎలక్షన్స్ సందర్భంగా ఫేస్ బుక్‌ లైవ్‌లోకి వచ్చింది. వచ్చీ రావడంతోటే నిస్సిగ్గుగా నోటికి పనిచెప్పింది. ప్రస్తుతం తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టిన శ్రీరెడ్డి.. తమిళ తంబీలకు లైవ్‌లో హాయ్ చెప్పింది. దీంతో ఆమె లైవ్‌లో టచ్‌లోకి వచ్చిన తమిళ తలైవా విజయ్ అభిమాని.. ‘విజయ్ గురించి ఒక్కమాట చెప్పండి? అని కోరడంతో.. తన బోల్డ్‌నెస్‌ను బయటపెట్టింది.

View this post on Instagram A post shared by Sri Reddy Mallidi (@srireddymallidi) on Jan 7, 2018 at 8:37am PST

‘హి లుక్స్ ఇన్నోసెంట్.. లుక్ లైక్ వర్జిన్ అంటూ తెగ సిగ్గుపడిపోతూ.. నేను చెప్పేది ఏంటంటే అతడు చూడ్డానికి చాలా ఫ్రెష్‌గా ఉంటారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్‌కి ఓటు వేయొద్దని.. మహా కూటమిని గెలిపించాలని కోరింది శ్రీరెడ్డి. అంతేకాదు కేటీఆర్, కేసీఆర్‌లపై సంచలన కామెంట్స్ చేసింది. ‘లేడీస్ లేకుండా కొడుక్కి నిద్రపట్టదు.. మందు లేకుండా తండ్రికి నిద్ర పట్టదు.. కబ్జా లేకుండా కూతురికి నిద్ర పట్టదు’ అంటూ పరోక్షంగా కేటీఆర్, కేసీఆర్, కవితలపై పంచ్‌లు వేసింది శ్రీరెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.