యాప్నగరం

‘మనం’కు నంది రాకపోవడానికి బాలయ్య కారణం కాదు

గతంలో ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బాలయ్య సినిమా మంగమ్మ గారి మనవడికి నంది ఇవ్వలేదు. బాలకృష్ణ కారణంగా ‘మనం’కు నంది రాలేదనడం అవాస్తవం.

TNN 16 Nov 2017, 10:36 pm
నంది అవార్డుల ప్రకటన విషయంలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. అవార్డుల ఎంపిక విషయంలో కులం, లాబీయింగ్ ప్రస్తావన తేవడం తప్పన్నారు. 1984 బాలయ్య సినిమా మంగమ్మ గారి మనవడు సూపర్ హిట్. అప్పుడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమాకు నంది అవార్డు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో అవార్డు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్లే లేరు. అప్పుడెందుకు ప్రశ్నించలేదు. కళకు కులం, ప్రాంతం లేదని కంభంపాటి తెలిపారు.
Samayam Telugu tdp leader kambhampati rammohan rao says there is no caste lobbying in nandi awards selection
‘మనం’కు నంది రాకపోవడానికి బాలయ్య కారణం కాదు


గతంలో ఎన్టీఆర్ ఎనిమిదేళ్లు, చంద్రబాబు 9 ఏళ్లు అధికారంలో ఉన్నారు. బాలయ్య ఎప్పుడూ సెక్రటేరియట్‌కు రాలేదు. జ్యూరీ సభ్యులు మొత్తం ఒక వర్గానికి చెందిన వారు ఉన్నారని చెప్పడం అవాస్తవం. 2014 జ్యూరీలో 12 మందిలో 11 మంది ఒకే వర్గానికి చెందినవారు ఉన్నారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా.. జ్యూరీ సభ్యులు సమాధానం చెబుతారని చెప్పారు.

బాలకృష్ణ సినిమా ఇప్పటికే 102 చిత్రాల్లో నటించారు. ఆయన కొత్తగా ఏం నటించడం లేదు. జ్యూరీ సభ్యులు అన్నింటికీ బదులిస్తారని తెలిపారు. బాలయ్య, నాగార్జున మధ్య గొడవ జరగడం వల్ల మనం సినిమాకు అవార్డు ఇవ్వలేదనే విమర్శలను తిప్పి కొట్టారు. ప్రతిభను బట్టే, మార్గదర్శకాల ప్రకారం చిరంజీవికి రఘపతి వెంకయ్య అవార్డు ఇచ్చారు. మూడేళ్లకు కలిపి ఇవ్వడంతోనే ఈ సమస్య తలెత్తిందని భావిస్తున్నామని ఆయన చెప్పారు. అక్కినేని పేరిట అవార్డు వారి కుటుంబ సభ్యులు ఇచ్చేదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.