యాప్నగరం

మరణించిన పవన్ ఫ్యాన్స్ కుటుంబాలకు అండగా వకీల్ సాబ్ యూనిట్.. ఆర్థిక సాయం ప్రకటన

కరెంట్ షాక్‌తో మృతి చెందిన పవన్ అభిమానుల కుటుంబాలకు అండగా నిలిచింది ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్.

Samayam Telugu 2 Sep 2020, 9:46 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాల్లో దిగ్భ్రాంతికరమైన ఘటన చేటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్ బర్త్ డే వేడుకల్లో భాగంగా ప్లెక్సీ కడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 10 మంది పవన్ అభిమానులకు కరెంట్ షాక్ తగిలింది. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Samayam Telugu పవన్ కళ్యాణ్
Pawan Kalyan Fans


చనిపోయిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా పోలీసులు గుర్తించారు. వీరంతా శాంతిపురం మండలం కడపల్లి గ్రామానికి చెందినవారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఈ మేరకు జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతికి లోనౌతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘గుండెల నిండా నా పట్ల అభిమానం నింపుకొన్న కుప్పం నియోజకవర్గ జనసైనికులు శ్రీ సోమశేఖర్‌, శ్రీ రాజేంద్ర, శ్రీ అరుణాచలం విద్యుత్‌ షాక్‌‌తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.. కొడుకుల్ని పోగొట్టుకున్న ఆ కుటుంబాలకు నేనే ఒక బిడ్డగా ఉంటానని.. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేస్తూ మరణించిన వారి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ప్రకటించారు.

ఇక పవన్ నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్” చిత్ర యూనిట్ కూడా ఈ విషాద ఘటనపై స్పందిస్తూ.. మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.