యాప్నగరం

‘మహర్షి’కి షాక్: హైకోర్టు డెడ్‌లైన్

హైకోర్టులో థియేటర్ యజమానులకు చుక్కెదురైంది. కోర్టు సూచనల మేరకు ఇప్పటికే ప్రభుత్వం టిక్కెట్ల రేపు పెంపు విషయంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

Samayam Telugu 11 May 2019, 4:38 pm
తెలంగాణలో ‘మహర్షి’ అదనపు షోలు, టిక్కెట్ ధరల పెంపుపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ‘మహర్షి’ సినిమాకి ఐదు షోలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వగా.. వాటితో పాటు టిక్కెట్ల రేటు పెంపుపై కూడా అనుమతి ఇచ్చిందని థియేటర్స్ యాజమాన్యాలు టిక్కెట్ల‌ రేటును పెంచారు. అయితే ఈ ఇష్యూపై ప్రభుత్వం సీరియస్‌గా కాగా.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. టిక్కెట్ ధరల పెంపునకు తాము అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. టిక్కెట్ ధరలను పెంచిన థియేటర్లపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
Samayam Telugu Maharshi Tickets Rate


ఈ టిక్కెట్ ధరలనేవి తెలంగాణ ప్రభుత్వం కాకుండా థియేటర్ యజమానులే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుని రేట్లు పెంచారని నిర్మాత దిల్ రాజు వివరణ ఇచ్చారు.

ఇక ఈ ఇష్యూ కోర్టుకి చేరడంతో హైకోర్టులో థియేటర్ యజమానులకు చుక్కెదురైంది. కోర్టు సూచనల మేరకు ఇప్పటికే ప్రభుత్వం టిక్కెట్ల రేపు పెంపు విషయంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించారు థియేటర్స్ యాజమాన్యాలు.

అయితే ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఆదేశించడం కుదరదని తేల్చింది కోర్టు. థియేటర్ల యజమానులు స్టేట్ సినిమా రెగ్యులేషన్ చట్టాన్ని ఫాలో అవ్వాలని అంటూ థియేటర్స్ ఓనర్స్ పిటీషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ ఎస్‌ చౌహాన్‌ తోసిపుచ్చారు. అయితే ఈ టిక్కెట్ల పెంపు విషయంలో థియేటర్ యజమానులు పెట్టుకున్న వినతిపై ప్రభుత్వం నియమించిన కమిటీ మే 16లోగా నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ విధించింది. ఈ మేరకు లైసెన్సింగ్ అథారిటీ, నగర పోలీస్ కమీషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.