యాప్నగరం

తెలంగాణ రాజకీయాల్లోకి జూనియర్ త్రిష!

‘ఈ రోజుల్లో’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగమ్మాయి రేష్మ రాథోర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతుంది.

Samayam Telugu 21 Mar 2018, 4:14 pm
‘ఈ రోజుల్లో’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగమ్మాయి రేష్మ రాథోర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతుంది. తొలిసినిమాతోనే సక్సెస్ అందుకుని జూనియర్ త్రిషగా పేరు సంపాదించుకుంది ఈ తెలంగాణ పోరి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘జై శ్రీరామ్, లవ్ సైకిల్, ప్రతిఘటన, అప్పవమ్ వీన్‌జుమ్ (మలయాళం), అధాగప్పట్టత్తు మగజనన్‌గలై (తమిళ్) చిత్రాలతో బాగానే అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆమధ్య ఒక ఐటెం సాంగ్‌లోనూ తళుక్కున మెరిసింది ఈ ముద్దగుమ్మ.
Samayam Telugu రేష్మ రాథోర్


అయితే ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా తనకు సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం అని అందుకే రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ మనసులోకి కోరికను బయటపెట్టింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేష్మ రాథోర్ షూటింగ్ గ్యాప్ దొరకడంతో సొంత జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనకు రాజకీయాలు అంటే ఇష్టం అని ఇక్కడి ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వచ్చి సేవచేస్తా అన్నారు.
రానున్న రోజుల్లో ఖచ్చితంగా తన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని తెలంగాణ రాష్ట్రం నుండి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరతారో క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఓ జాతీయ పార్టీలో చేరతానంటూ హింట్ ఇచ్చారు రేష్మ రాథోర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.