యాప్నగరం

తప్ప తాగిన కమెడియన్.. కారు కింద దూరాడు

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన కమెడియన్ నవీన్ తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పోలీసులకు చిక్కాడు.

TNN 3 Dec 2017, 7:13 pm
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన కమెడియన్ నవీన్ తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పోలీసులకు చిక్కాడు. పోలీసులు తనిఖీలు చేస్తుండడం గమనించిన నవీన్ పోలీస్‌ల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించి కారు కిందకు దూరాడు. ఇది గమనించిన మీడియా మనోడి బండారాన్ని బయటపెట్టింది. దీంతో అతడికి ఆల్కహాల్‌ పరీక్షలు నిర్వహించిన పోలీసులు మద్యం తాగి వాహనం నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో నవీప్‌పై కేసు నమోదుచేసి.. అతని వాహనాన్ని సీజ్‌ చేశారు.
Samayam Telugu telugu comedian naveen caught in drunk and drive case
తప్ప తాగిన కమెడియన్.. కారు కింద దూరాడు


ఇక నవీన్‌తో పాటు ఫుల్‌గా పబ్బుల్లో మందుకొట్టి కారు నడుపుతున్న పలువురు యువతీయువకులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో 20 మందిపై కేసులు బుక్ గాకా 14 కార్లు, 6 బైకుల్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కుమార్ 21ఎఫ్ మూవీతో పాపులర్ అయిన ఈ కమెడియన్ ఇటీవల గోపీచంద్ నటించిన ‘ఆక్సిజన్’ మూవీలో కనిపించాడు. తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ మూవీలో నవీన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.