యాప్నగరం

ఏపీలో చిత్ర పరిశ్రమకు చేయూతనివ్వండి: సీఎం జగన్‌కు నిర్మాతల మండలి లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి లేఖ రాసింది. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చేయూతనివ్వాలని లేఖలో కోరింది.

Samayam Telugu 27 May 2020, 9:49 pm
చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్థలాలను కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరింది. ఈ మేరకు మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, కార్యదర్శులు టి.ప్రసన్నకుమార్, వడ్లపట్ల మోహన్ ముఖ్యమంత్రికి బుధవారం లేఖ రాశారు. జీవో నెం.45 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వానికి చెందిన ప్రాంగణాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రికి వారు కృతజ్నతలు తెలియచేశారు.
Samayam Telugu సీఎం వైఎస్ జగన్
AP CM Jagan Mohan Reddy


చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలు నిర్మించుకోవడానికి, ల్యాబ్స్ కట్టుకోవడానికి స్థలాలు ఉదారంగా కేటాయించారని.. అలాగే నిర్మాతలు, ఆర్టిస్టుల హౌసింగ్ కొరకు కూడా స్థలాలు ఇచ్చారని వారు గుర్తు చేశారు. అదే విధంగా నేడు ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి పరిశ్రమ వర్గాలకు అవసరమైన స్థలాలను కేటాయించాలని వారు ఈ లేఖలో కోరారు. ఇదే లేఖను ఏపీ టెలివిజన్, చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయకుమార్ రెడ్డికి, ఛైర్మన్ విజయ చందర్‌కు కూడా అందించారు.
ఏపీ సీఎం జగన్‌కు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి రాసిన లేఖ.. క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.