యాప్నగరం

ఆసుపత్రిలో సుద్దాల అశోక్ తేజ.. బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కోసం ఎదురుచూపు

జానపద గేయ రచయిత, ప్రముఖ సినీ రచయిత ఆసుపత్రిలో చేరారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు.

Samayam Telugu 21 May 2020, 1:17 pm
ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా.. ఆయన్ని పరీక్షించిన వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు.
Samayam Telugu సుద్దాల అశోక్ తేజ (suddala ashok teja)
suddala ashok teja


అయితే లాక్ డౌన్ నేపథ్యంలో రక్తం కొరత విపరీతంగా ఉంది. సుద్దాల అశోక్ తేజ బ్లడ్ గ్రూప్ B నెగిటివ్ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఈ బ్లడ్ గ్రూప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా B నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న రక్త దాతలు ఉంటే గచ్చిబౌలిలోని ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిలో సంప్రదించవచ్చని.. 8985038016 నంబర్‌ని సంప్రదించి రక్త దాతలు ముందుకు రావాలని సుద్దాల అశోక్ తేజ మిత్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

కాగా సుద్దాల అశోక్ తేజ.. అనేక విప్లవ గీతాలతో క్లాసిక్ సాంగ్స్‌ను రాశారు. నేను సైతం (ఠాగూర్), ఒకటే జననం.. ఒకటే మరణం (భద్రాచలం), ఇనుములో ఒక హృదయం మొలిచెనే (రోబో), నువ్ ఏడికెళ్తే ఆడికొస్తా సువర్ణా, వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే (ఫిదా) వంటి సూపర్ హిట్స్ సాంగ్స్ రాశారాయన. ప్రస్తుతం సుద్దాల ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో మూడు పాటలు రాయడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.