యాప్నగరం

ఓవర్సీస్‌లో తెలుగు సినిమాల టోటల్ కలెక్షన్స్

సంక్రాంతి బరిలో నిలిచిన తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ బాగా పర్‌ఫామ్ చేస్తున్న సంగతి...

Samayam Telugu 24 Jan 2017, 7:37 am
సంక్రాంతి బరిలో నిలిచిన తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ బాగా పర్‌ఫామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ప్రాఫిట్స్ జోన్‌లోకి ఎంటరైన ఈ చిత్రాల సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ ఇంకొంత పుంజుకున్నాయి. ఖైదీ సినిమా విషయానికొస్తే, సెకండ్ వీకెండ్‌లో సాధించిన 1,48,000 డాలర్లతో కలిపి ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ 2.39 మిలియన్ డాలర్లకి చేరుకున్నాయి.
Samayam Telugu telugu movies total collections in the us
ఓవర్సీస్‌లో తెలుగు సినిమాల టోటల్ కలెక్షన్స్


శర్వానంద్, అనుపమ జంటగా తెరకెక్కిన శతమానం భవతి చిత్రం కూడా చిత్ర యూనిట్ అంచనాలకి తగినట్టుగానే వసూళ్లు రాబడుతోంది. ఈ వారం సాధించిన 1,31,000 డాలర్లతో కలిపి శతమానభవతి ఓవర్సీస్ బాక్సాఫీస్ మొత్తం 6,82,000 డాలర్లకు చేరుకుంది.

లాస్ట్ బస్ నాట్ లీస్ట్.. బసవతారకరామపుత్ర బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం సెకండ్ వీకెండ్ లో 1,45,000 డాలర్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా మొత్తం 1.60 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఈ వారాంతంతో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కూడా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోతుంది అని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.