యాప్నగరం

థాయ్‌ గుహ ఘటనపై హాలీవుడ్ మూవీ!

12 మంది పిల్లలు, ఒక యంగ్ కోచ్.. భయానకమైన గుహలో చిక్కుకున్నారు. 9 రోజులు తిండి, నీరు లేక, ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపారు.

Samayam Telugu 12 Jul 2018, 10:25 pm
12 మంది పిల్లలు, ఒక యంగ్ కోచ్.. భయానకమైన గుహలో చిక్కుకున్నారు. 9 రోజులు తిండి, నీరు లేక, ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రపంచమంతా కదిలింది. వారిని ఎలా తీసుకొచ్చారనేది కూడా అంతుచిక్కని విషయం. ఇది సరిపోదా.. ఒక సినిమా తీయాలంటే!
Samayam Telugu 703492-thai-cave-rescue-afp


ఈ అంశాన్ని బిగ్‌స్క్రీన్‌పై చూపించేందుకు ప్యూర్‌ ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సుమారు 60 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో రూ.400 కోట్లు) బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమైంది. ఈ విషయాన్ని నిర్మాతలు మైకెల్ స్కాట్, ఆడమ్ స్మిత్‌లు ప్రకటించారు. ఈ గొప్ప రెస్క్యూ చిత్రాన్ని.. ఆపరేషన్లో పాల్గొన్న వీరులకు, ప్రాణాలు కోల్పోయిన డైవర్‌ సమన్‌కు అంకితమిస్తామని తెలిపారు. లాస్‌ఏంజెల్స్‌కు చెందిన ఇవన్హోయె పిక్చర్స్ సంస్థ కూడా దీనిపై సినిమా తీసేందుకు సిద్ధమైంది. ఇది కోచ్ ఎక్కపొల్ చాంతవాంగ్‌ను లీడ్‌గా చేసుకుని తెరకెక్కించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.