యాప్నగరం

ఘాజీ: ప్రణబ్‌కు రానా లేఖ

ఘాజీ మూవీ హీరో రానా దేశం కోసం ప్రాణత్యాగం చేసి మరుగున పడి పోయిన సైనికుల గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌కు లేఖ రాశారు.

TNN 15 Feb 2017, 6:10 pm
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా .. విభిన్న కథాంశంతో తెరకెక్కిన మూవీ ఘాజీ. ఈ సినిమాలో రానా లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ పాత్రతో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. 1971లో జరిగిన ఇండో పాక్ సబ్ మెరైన్ అటాక్‌ కథాంశంతో తెరకెక్కింది ఈచిత్రం . ఫిబ్రవరి 17న రిలీజ్‌ విడుదలౌతోన్న ఈ చిత్ర ప్రీమియర్ షోను ఈ రోజు (బుధవారం) ప్రదర్శించడంతో అద్భుతమైన రెస్ఫాన్స్ వస్తోంది.
Samayam Telugu the ghazi attack rana writes to president to acknowledge indian armed forces
ఘాజీ: ప్రణబ్‌కు రానా లేఖ


అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న రానా దేశం కోసం ప్రాణత్యాగం చేసి మరుగున పడి పోయిన సైనికుల గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రపతి ప్రణబ్‌కు లేఖ రాశానని ప్రకటనలో తెలియజేశారు.

సరిహద్దుల్లో ఉంటూ దేశం కోసం సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని.. ఈ సినిమా షూటింగ్ సమయంలో 18 రోజులపాటు సముద్రగర్భంలోనే గడిపానని.. ఘాజీ సినిమా ప్రారంభించడానికి ముందు యుద్ధసమయంలో జలాంతర్గామిలో ఉన్న పలువురు ఆర్మీ అధికారులను కలిశాను. వార్‌లో వారు ఎదుర్కొన్న సవాళ్లు, పోరాడిన తీరును అడిగి తెలిసుకున్నానని.. వారి త్యాగాలను విని చలించిపోయానని వారి వీరోచిత గాధలు గుర్తించాలని కోరుతూ ప్రణబ్‌కు లేఖ రాశానన్నారు రానా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.