యాప్నగరం

Thalapathy Vijay: వారసుడు రన్ టైమ్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ప్రేక్షకులకు అగ్ని పరీక్షే

దళపతి విజయ్ లేటెస్ట్ తమిళ్ చిత్రం ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదలవుతోంది. ముందుగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించినా.. ఆ తర్వాత 11వ తేదీ ఫిక్స్ చేశారు మేకర్స్. సంక్రాంతి సీజన్‌కు పెద్ద సినిమాలు బరిలో ఉండటమే ఇందుకు రీజన్ కాగా.. అజిత్ ‘తెగింపు’ మూవీ కూడా అదే రోజున విడుదల కానుంది. కానీ ‘వారసుడు’ ఫైనల్ రన్ టైమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుండగా.. ఇప్పుడు ఇదే అంశం ఫ్యాన్స్‌‌ను కలవరపెడుతోంది.

Authored bySanthosh Damera | Samayam Telugu 8 Jan 2023, 12:46 pm

ప్రధానాంశాలు:

  • విజయ్ ‘వారసుడు’కు లాంగ్ రన్ టైమ్
  • ఇదే విషయంలో కలవరపడుతున్న ఫ్యాన్స్
  • టైట్ స్క్రీన్‌ప్లే ఉంటే తప్ప కష్టమని భావన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Thalapathy Vijay Varasudu
దళపతి విజయ్
తమిళ్‌లో స్టార్ హీరోగా ఊహకందని ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్ (Thalapathy Vijay). అభిమానులతో ఇళయ దళపతిగా పిలువబడే విజయ్ నటించిన సినిమాలకు సౌత్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉంది. అలాగే దర్శక నిర్మాతలకు ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనే కోరిక ఉండటం సహజం. ఈ క్రమంలోనే తెలుగులో టాప్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న దిల్ రాజు (Dil Raju).. విజయ్‌తో ‘వారిసు’ మూవీ ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. ఇక తెలుగులో ‘వారసుడు’ (Varasudu) పేరుతో విడుదలవుతుండగా.. తాజాగా మూవీ రన్ టైమ్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ మధ్యే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న సినిమా CBFC క్లీన్ U సర్టిఫికెట్ పొందింది. ప్రస్తుతం ఈ సెన్సార్ సర్టిఫికెట్ బయటకు రాగా.. ఇందులో సినిమా 2 గంటల 50 నిమిషాలు(170 నిమిషాలు) రన్‌టైమ్‌ కలిగి ఉన్నట్లుగా పేర్కొనడం షాక్ ఇస్తోంది. ఇంత లాంగ్ రన్ టైమ్ కలిగి ఉన్న సినిమాలు ఈ మధ్య కాలంలో రావడం లేదనే చెప్పాలి. ఒకవేళ వచ్చినా ఆడియన్స్‌ సహనానికి పరీక్ష పెడుతూ బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ‘వారసుడు’ మూవీని లాంగ్ రన్ టైమ్‌తో విడుదల చేయడమంటే సాహసమనే చెప్పాలి.

సాధారణంగా విజయ్ సినిమాలు హిట్, ఫ్లాప్ టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడతాయి. కానీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఆయన సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే ఎంతో కొంత నష్టాలు తెచ్చుకునే ప్రమాదం ఉంది. పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వాడకం పెరిగాక ప్రేక్షకులు దాదాపు మూడు గంటల పాటు థియేటర్‌లో కూర్చుని సినిమా చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ టైట్ స్క్రీన్‌ప్లే ఉంటే తప్ప దర్శకుడు ఇంత నిడివి గల సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేడు.

అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాల్లో హ్యూమన్ ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆయన తీసిన ‘బృందావనం, ఊపిరి, మహర్షి’ చిత్రాల్లో అది ప్రూవ్ అయింది కూడా. కాగా.. ‘వారసుడు’ మూవీకి సైతం ఎమోషన్స్ కీలకం కానున్నాయా? అంటే అవుననే చెప్పొచ్చు. ట్రైలర్‌ ప్రకారం.. పెద్ద ఉమ్మడి కుటుంబం, బంధాలు బాధ్యతల చుట్టే వంశీ కథ అల్లుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ ప్రస్తుత రోజుల్లో ఆడియన్స్‌ను మెప్పించడం అంత సులభమైన పనేం కాదు. కథలో కొత్తదనం లేకపోతే.. ఎంతటి స్టార్ హీరో సినిమానైనా నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు.

ఇక ‘వారసుడు’ జనవరి 11న విడుదలవుతుండగా.. సౌత్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిందే.

రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.