యాప్నగరం

Ram Charan: రాంచరణ్‌కు అరుదైన గౌరవం.. అమెరికాకు ముందుగా వెళ్లింది అందుకే!

Ram Charan at Oscars 2023: మెగా పవర్‌స్టార్ రాంచరణ్ యూఎస్‌కు పయనమైన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆస్కార్ అవార్డుల వేడుక ఇంకో 20 రోజులు ఉండగా.. చరణ్ ఇప్పుడే ఎందుకు వెళ్లాడన్న అభిమానుల సందేహాలకు ఆన్సర్ దొరికింది.

Authored bySanthosh Damera | Samayam Telugu 21 Feb 2023, 4:12 pm

ప్రధానాంశాలు:

  • అమెరికాకు పయనమైన రాంచరణ్ తేజ్
  • ఆస్కార్ వేడుక కోసం 20 రోజుల ముందే
  • ఫిబ్రవరి 24న HCA ఫిల్మ్ అవార్డ్స్‌ ఈవెంట్
  • ప్రజెంటర్‌గా వ్యవహరించనున్న చరణ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ram Charan
Ram Charan: రాంచరణ్
RRR Oscar nominations 2023: RRR తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ (Ram Charan) RC15 చిత్రంలో పాల్గొంటున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక. ఎస్వీసీ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత పార్ట్ షూటింగ్ జరుపుకోగా.. ప్రస్తుతం బ్రేక్ ఇచ్చారు మేకర్స్. ఇదే క్రమంలో చరణ్ తాజాగా మరోసారి అమెరికాకు వెళ్లాడు. RRR ఆస్కార్ నామినేషన్స్ కోసం ఈ మధ్యే మూవీ టీమ్ కొంతకాలం అక్కడే ఉండి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ (Oscars) ఫైనల్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుని రేసులో నిలిచింది. ఈ అవార్డుల వేడుక మార్చి 12న జరగనుండగా.. చరణ్ 20 రోజుల ముందే యూఎస్ వెళ్లడంపై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే వాటన్నింటికీ సమాధానం దొరికేసింది.
Dil Raju: బలగంతో ర్యాలీలో పాల్గొన్న దిల్ రాజు.. నిజామాబాద్‌లో రాజుగారి హవా
ఫిబ్రవరి 24న ది బెవర్లీ విల్‌షైర్, ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరగనున్న 6వ వార్షిక హెచ్‌సీఎ ఫిల్మ్ అవార్డ్స్‌కు రాంచరణ్ హాజరు కానున్నారు. 2023 HCA ఫిల్మ్ అవార్డ్స్‌కు సంబంధించి ప్రజెంటర్స్‌లో ఒకరిగా చరణ్ అరుదైన గౌరవం పొందారు. బ్రాండన్ పెరియా, డేవిడ్ దస్‌మాల్చియాన్, మాడెలిన్ క్లైన్, ట్రినిటీ జో-లి బ్లిస్, వైలెట్ మెక్‌గ్రా తదితరులు సైతం ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో సమర్పకులుగా వ్యవహరించనున్నారు. అందుకే చరణ్ యూఎస్ వెళ్లగా.. సంబంధిత పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే, రాంచరణ్ అయ్యప్ప మాలలో ఉన్నందున కాళ్లకి చెప్పులు లేకుండానే అమెరికా బయలుదేరాడు.
మరో విషయం ఏంటంటే.. బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ సహా బెస్ట్ మూవీ తదితర విభాగాల్లో HCA ఫిల్మ్ అవార్డ్స్ 2023 ఫైనల్ నామినేషన్స్‌లో RRR చోటు సంపాదించింది. అలాగే ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ ఫైనల్ నామినేషన్లలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మిగతా RRR టీమ్ మార్చి 7న లాస్ వేగాస్‌కు వెళ్లనుంది. ఇదిలా ఉంటే, తారకరత్న హఠాన్మరణం చెందడంతో నందమూరి ఫ్యామిలీ బాధలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అక్కడికి వెళ్లే విషయంలో క్లారిటీ లేదు. అయితే, ఈ ఈవెంట్‌లో RRR టీమ్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వనుందని తెలుస్తోంది.


రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.