యాప్నగరం

తనుశ్రీ వివాదం.. ‘బిగ్‌బాస్’ నిర్వాహకులకు వార్నింగ్!

తనుశ్రీ వివాదం రోజు రోజుకు ముదిరిపోతోంది. ఆమె చేసిన ఆరోపణలపై రాజ్‌థాకరేకు చెందిన ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 3 Oct 2018, 9:22 pm
బాలీవుడ్ నటులు తనుశ్రీ, నానా పటేకర్ వివాదం బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. నానా పటేకర్‌పై తనుశ్రీ లైంగిక ఆరోపణలు చేయడమే కాకుండా తనపై రాజ్‌థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీ అనుచరులు తనపై దాడి చేశారని తెలిపింది. దీంతో, ఎంఎన్‌ఎస్ పార్టీ కార్యకర్తలు తనుశ్రీపై గుర్రుగా ఉన్నారు.
Samayam Telugu Untitled1dd11


ఈ నేపథ్యంలో తనుశ్రీ త్వరలో తన సోదరి ఇషితా దత్తాతో కలిసి హిందీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్’ షోలో ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఎంఎన్‌ఎస్ పార్టీకి చెందిన యూత్ సెల్ ప్రతినిధులు లొనవ్లాలోని ‘బిగ్‌బాస్ -12’ నిర్వాహకులను కలిసి తనుశ్రీని వారి షోలోకి తీసుకోరాదని డిమాండు చేశారు. తమ హెచ్చరికలు లెక్కచేయపోతే హింస చెలరేగే అవకాశం ఉందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.