మొన్నటి వరకూ మూతి అష్టవంకర్లు తిప్పుతూ వీర లెవల్లో పోజులు ఇచ్చే సెల్ఫీ మోజు అప్డేట్ అయ్యింది. ఇప్పుడు దీనికి లేటెస్ట్ వెర్షన్ ‘టిక్ టాక్’ వచ్చింది. ఇంతకు ముందు తనలో తాను మాట్లాడుకుంటే పిచ్చోడో పిచ్చిదో అనేవారు. ఇప్పుడు ఈ ‘టిక్ టాక్’ వచ్చాక ఈ పిచ్చి పీక్స్ వెళ్లిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూసినా ఎదురుగా ఫోన్ పెట్టుకుని వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవడం.. మూతితో పాటు మిగిలిన అన్ని భాగాలను అష్టవంకర్లు తిప్పుతూ వాళ్లే పాటలు పాడేస్తారు. వాళ్లే డైలాగ్‌ల చెప్పేస్తారు.. వాళ్లే డాన్స్‌లు కూడా చేసేస్తారు. ఈ టిక్ టాక్ సామ్రాజ్యానికి వాళ్లే రాజులు వాళ్లే మంత్రులు. సరే ఈ టిక్ టాక్ బాతాఖానీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే.. వివాదాల దర్శకుడు వర్మను సైతం వదలకుండా అమ్మాయిలు ‘టిక్ టాక్’ చేసేశారు. గతంలో ప్రముఖ యాంకర్ స్వప్నతో ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలో అమ్మాయిలపై ఆయన చేసిన రసగుల్లా కామెంట్స్‌ని తిరిగి అమ్మాయిలే టిక్ టాక్ చేయడంతో వర్మ ఆ టిక్ టాక్ వీడియోలను ఓ రేంజ్లో వాడుకుంటున్నాడు.
ఆ బోల్డ్ ఇంటర్వ్యూలో ‘మీకు చాలా ఇష్టమైన పదం అమ్మాయి కరెక్టేనా? అని యాంకర్ స్వప్న అడిగితే.. ‘అమ్మాయి అనే మాట విన్నప్పుడు నాకు రసగుల్లా గుర్తుకు వస్తుంది. సో రసగుల్లా అంటే జనానికి ఎంత ఇష్టమో నాకు అమ్మాయి అంటే అంత ఇష్టం’.. అంటూ పచ్చిగా చెప్పేశాడు వర్మ. నాటి వీడియోను ఒక అమ్మాయి టిక్ టాక్ చేసి వర్మ అవతారం ఎత్తింది. దీన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన వర్మ ‘ఈ అమ్మాయి కూడా చాలా చెడ్డ స్వభావం కలది.. ఎందుకంటే మహిళల్ని రసగుల్లాతో పోల్చింది’ అంటూ సెటైర్ వేశాడు వర్మ. అప్పట్లో వర్మ చేసిన ఈ రసగుల్లా కామెంట్స్ వివాదం అయిన విషయం తెలిసిందే.