యాప్నగరం

‘తొలి ప్రేమ‌’ ఆడియో విడుదల తేదీ ఫిక్స్!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, క్యూట్ బ్యూటీ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తొలిప్రేమ’. శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మితస్తున్నారు.

TNN 18 Jan 2018, 12:04 pm
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, క్యూట్ బ్యూటీ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తొలిప్రేమ’. శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మితస్తున్నారు. వెంకీ అట్లూరి ద‌ర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుద‌ల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్స్ పనులు జ‌రుగుతున్నాయి. ‘తొలిప్రేమ’ పాట‌ల‌ను జ‌న‌వ‌రి 20న విడుద‌ల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
Samayam Telugu tholi prema audio release on january 20th
‘తొలి ప్రేమ‌’ ఆడియో విడుదల తేదీ ఫిక్స్!

When words fail, Music speaks!#TholiPremaAudio on Jan 20th ❤️ A @MusicThaman Musical@IAmVarunTej @RaashiKhanna @dirvenky_atluri #SVCC @ShreeLyricist pic.twitter.com/degvdbyNn1 — SVCC (@SVCCofficial) January 18, 2018
‘హృద‌యానికి హ‌త్తుకునే ప్రేమ‌క‌థ‌ మా ‘తొలిప్రేమ’. వ‌రుణ్ తేజ్ కొత్త పాత్రలో క‌న‌ప‌డ‌తారు. ఇప్పటికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, ‘నిన్నిలా నిన్నిలా చూశానే...’ అనే పాటకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలను జ‌న‌వ‌రి 20న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నాం. అలాగే ఫిబ్రవరి 9న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాత చెప్పారు. ఈ సినిమాలో సుహాసిని, ప్రియదర్శి, విద్యుల్లేఖ రామన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.