యాప్నగరం

విజయనిర్మల అంతిమ యాత్ర.. ఫిల్మ్ ఛాంబర్‌కు పార్థీవదేహం

నటిగా, దర్శకురాలిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్న ప్రముఖ దర్శక నటి విజయ నిర్మలకు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

Samayam Telugu 28 Jun 2019, 12:06 pm
బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన ప్రముఖ నటి విజయ నిర్మల అంత్యక్రియలు కొద్దిసేపటి కిందట ప్రారంభమయ్యాయి. ఆమె పార్థీవ దేహాన్ని తొలుత ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అక్కడ కాసేపు ఉంచి, మెయినాబాద్‌ మండలంలోని చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌‌కు తరలిస్తారు. అక్కడే విజయ నిర్మలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంతకు ముందు ఏపీ సీఎం జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ‌కృష్ణ, నరేశ్‌లను వీరంతా ఓదార్చారు. నానక్‌రామ్‌ గూడలోని ఆమె నివాసం నుంచి బంధులువు, అభిమానుల కన్నీటి మధ్య కడసారి యాత్ర మొదలైంది. ముందు ప్రకటించినట్టు ఉదయం 11.00 గంటలకే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నా, కొంత ఆలస్యమైంది. మరోవైపు అంతిమయాత్రకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా విజయ నిర్మలతో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు.
Samayam Telugu nirmala


Read Also: విజయ నిర్మలకు నివాళలర్పించిన జగన్


మరోవైపు, విజయ నిర్మల మరణవార్తను కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. తన ప్రాణం వదిలివెళ్లిపోయిందని ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరి తరంకావడంలేదు. విజయనిర్మల పార్థివదేహం వద్ద విలపిస్తునన కృష్ణను అలా చూసి కుటుంబసభ్యులు, సినీ పరిశ్రమకు చెందినవారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే కృష్ణ గారిని అలా చూడలేకపోతున్నాం అంటున్నారు.

ప్రపంచ సినీ చరిత్రలోనే ఏ మహిళా దర్శకురాలికీ సాధ్యం కాని విధంగా ఏకంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పింది. ఆమె దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు చాలా వరకూ విజయం సాధించాయి. అభ్యుదయ భావాలున్న చిత్రాలే ఆమె ఎక్కువగా తీశారు. నవలా చిత్రాలకు ఆమె పెట్టింది పేరు. సావిత్రి తర్వాత లెజెండరీ నటుడు శివాజీ గణేషన్‌ను డైరెక్ట్ చేసిన రెండో మహిళ డైరెక్టర్‌గా ఆమె అరుదైన ఘనత సాధించారు. విజయ నిర్మల ఖాతాలో మరో అరుదైన రికార్డుంది. ప్రపంచ సినీ చరిత్రలో ఒక నటుడితో కలిసి అత్యధిక చిత్రాల్లో కథానాయికగా నటించిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఆ నటుడు కృష్ణ కాగా, వీళ్లిద్దరూ కలిసి 47 చిత్రాల్లో నటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.