యాప్నగరం

‘ఆ నలుగురు’ సినిమా దర్శకుడు మదన్ పరిస్థితి అత్యంత విషమం

Director Madan: ‘ఆ నలుగురు’ సినిమా దర్శకుడు మదన్ పరిస్థితి విషమంగా ఉంది. 4 రోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెళ్లైన కొత్తలో సినిమాతో ఆయన దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 19 Nov 2022, 11:31 pm

ప్రధానాంశాలు:

  • టాలీవుడ్ దర్శకుడు మదన్ పరిస్థితి విషమం
  • నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన మదన్
  • పెళ్లైన కొత్తలో సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ
  • ఆ నలుగురు సినిమాతో ఆలోచింప చేసిన మదన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tollywood Director Madan
డైరెక్టర్ మదన్
టాలీవుడ్‌లో ‘ఆ నలుగురు’ సినిమాతో అందర్నీ ఆలోచింప చేసిన దర్శకుడు మదన్ (Director Madan) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 4 రోజుల కిందట ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. కుటుంబసభ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జగపతి బాబు హీరోగా నటించిన ‘పెళ్లైన కొత్త’లో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మదన్.. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి లాంటి భిన్నమైన చిత్రాలకి దర్శకత్వం వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో పుట్టి పెరిగిన మదన్.. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే నాటకాలు వేసినట్లు గతంలో ఆయన చెప్పారు. ఆ తర్వాత సినిమాలపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌కి వచ్చేశారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఎస్ గోపాల్ రెడ్డి దగ్గర పనిచేశారు. అనంతరం కొన్ని చిత్రాలకి సహ రచయితగా వ్యవహరించారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు.

పెళ్లైన కొత్తలో సినిమా ద్వారా భార్యభర్తల మధ్య ఇగో ఉంటే ఏమవుతుందో చూపించిన మదన్.. ఆ నలుగురు సినిమాలో లోకం పోకడని పరిచయం చేస్తూనే మంచితనంతో ఉంటే చివరికి ఎలాంటి గౌరవం లభిస్తుందో గుర్తు చేశారు. భిన్నమైన చిత్రాలు తీసి అతి తక్కువ వ్యవధిలోనే మంచి గుర్తింపు సాధించారు మదన్. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Read Latest Telugu Movies News , Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.