యాప్నగరం

పుల్లేటికుర్రులో మోక్షజ్ఞతో కలిసి బాలయ్య ప్రత్యేక పూజలు.. కారణం ఇదే!

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలయ్యకు ఆథ్యాత్మిక చింతన ఎక్కువే. తాను ఏ పని ప్రారంభించినా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తనకు నమ్మకమైన ఆలయాలను సందర్శిస్తుంటారు.

Samayam Telugu 27 Jul 2019, 12:04 pm
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలోని పుల్లేటికుర్రు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులోని చౌడేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో తనయుడు మోక్షజ్ఞతో కలిసి బాలయ్య గురువారం ప్రత్యేక పూజలు చేశారు. త్వరలో కొత్త సినిమా ప్రారంభం కానున్న సందర్భంగా ఆలయంలో చండీ హోమం, సుదర్శన హోమం, రామలింగేశ్వరస్వామికి రుద్రాభిషేకం చేయించారు. పుల్లేటికుర్రుకు చెందిన ప్రముఖ వేద పండితులు, బాలకృష్ణ ఆధ్యాత్మిక గురువు కారుపర్తి నాగ మల్లేశ్వరరావు సిద్దాంతి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు,హోమాలు అభిషేకాలు నిర్వహించారు. కారుపర్తి నాగ మల్లేశ్వరరావు సిద్దాంతిగారి జ్యోతిషం అంటే బాలయ్యకు అపార నమ్మకం. తాను ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆయన సలహా తీసుకుంటారు. కుమార్తెల వివాహాల విషయంలో ఆయన సూచనలు, సలహాలను పాటించారని అంటారు.
Samayam Telugu bala


బాలకృష్ణ తన కొత్త చిత్రం ప్రారంభించే ముందు ఇక్కడకు వచ్చి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. బాలయ్య ఇక్కడికి వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. చౌడేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు సిద్ధాంతి ఇంటి వద్దకు కూడా అభిమానులు, ప్రజలను అనుమతించలేదు. పుల్లేటికుర్రు చౌడేశ్వరి ఆలయంలో అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖలు పూజలు నిర్వహిస్తారు. ఏకాదశ రుద్రుల్లో ఒకరైన అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి ఈ గ్రామంలో ఉండేవారి అంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.