యాప్నగరం

Pawan Birthday: పవన్‌కి శుభాకాంక్షల వెల్లువ.. టాలీవుడ్ పిలుస్తోంది మళ్లీ రావా!

Pawan Kalyan Birthday Tweets: పవర్ స్టార్ .. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు ఉండొచ్చు కాని అభిమానుల్లో ఆయనకు ఉన్న స్థాయివేరు.. ఆయన స్థానం వేరు. ఆయనకు అభిమానులు ఉండరు, ఉన్నారంటే వాళ్లు పవన్ భక్తులు మాత్రమే అంతలా పూజిస్తారు.

Samayam Telugu 2 Sep 2019, 10:32 am
సమాజం అంటే అమితమైన ప్రేమ అంతకు మించి పిచ్చి అందుకోసం తన ఆలోచల్ని ఇజంగా మార్చిన భావకుడతడు. అభిమానం అనే పదాన్ని భక్తి స్థాయి తీసుకువెళ్లిన ట్రెండ్ సెట్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. ఈ సందర్భగా అభిమానులు అసలైన పండుగను నిర్వహించుకుంటున్నారు. వినాయక చవితి కూడా ఇదే రోజు కలిసి రావడంతో ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు.
Samayam Telugu Pawan Kalyan Birthday Tweets


Read Also: పవన్.. ఓ ఉద్వేగ ఝ‌రి, ఎర్ర తుండుకెందుకంత భావోద్వేగం?

పవర్ స్టార్ నామస్మరణతో సోషల్ మీడియా హీటెక్కుతోంది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వరుస ట్వీట్లు వెల్లువలా వస్తున్నాయి. నెల రోజుల ముందు నుండే పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రారంభం కావడంతో పవన్ కళ్యాణ్ అనే పేరు ప్రస్తుతం ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించిన పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే ట్వీట్లు ఉవ్వెత్తున వస్తున్నాయి. ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. చాలా మంది పవర్ స్టార్ మళ్లీ మీరు సినిమాలు చేయాలి .. మాకోసం మళ్లీ రావాలి అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు.

Read Also; పవన్‌కి ‘వాల్మీకి’ బర్త్ డే విష్.. పోస్టర్ పవర్ ఫుల్

మెగా హీరోలు అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్‌లతో పాటు టాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు. ఆ ట్వీట్స్ చూద్దాం.











తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.