యాప్నగరం

AP New CM: జగన్ పాలనలో ఏపీకి గొప్ప భవిష్యత్: సెలబ్రెటీలు

ప్రజలు అఖండ మెజార్టీతో ఆయనకు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఆయనకు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Samayam Telugu 24 May 2019, 12:27 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్న జగన్‌పై నమ్మకముంచిన ప్రజలు అఖండ మెజార్టీతో ఆయనకు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఆయనకు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.
Samayam Telugu pjimage (4)


వైఎస్ జగన్‌కు తొలి నుంచీ మద్దతుగా నిలిచిన హీరో అక్కినేని నాగార్జున జగన్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘ ఘన విజయం సాధించిన కొత్త యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అభినందనలు అంటూ నాగార్జున్ ట్వీట్ చేశారు.

‘ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికైన యంగెస్ట్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మంచి పాలన అందిచాలని కోరుకుంటూ శుభాకాంక్షలు’ - రవితేజ

వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా- హీరో

జగన్ గారికి అభినందనలు. ఇది పవర్‌ఫుల్ విక్టరీ- వెంకటేశ్ దగ్గుబాటి












తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.