యాప్నగరం

అలా చేసుండకపోతే దాసరి మరో పదేళ్లు బతికేవారట

దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. అయితే దాసరి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడం ఆయన చేసుకున్న తప్పిదమేనట.

TNN 30 Jun 2017, 4:10 pm
బరువు తగ్గడానికి తీసుకున్న చికిత్సే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానికి కారణమైందని సీనియర్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు అన్నారు. దాసరి మరణంపై అయన సన్నిహితులు చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఆయన మరణంపై ఆయనకు సన్నిహితుడైన రేలంగి నర్సింహారావు స్పందించారు. యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకరత్న మరణానికి గల కారణాలను రేలంగి వివరించారు. చికిత్సలో భాగంగా దాసరిగారు తొలుత జీర్ణాశయంలో బెలూన్ వేయించుకున్నారని, ఆ తర్వాత ఆరేడు కిలోల వరకు బరువు తగ్గారని తెలిపారు. దీనిపై నమ్మకంతోనే రెండోసారి కూడా సర్జరీకి వెళ్లి, బెలూన్ వేయించుకోవడమే ఆయన ప్రాణం తీసిందని చెప్పారు.
Samayam Telugu tollywood director relangi narasimharao tells dasari naryana rao death
అలా చేసుండకపోతే దాసరి మరో పదేళ్లు బతికేవారట


రెండోసారి సర్జరీకి వెళ్లడమే దాసరి చేసిన తప్పు అని రేలంగి పేర్కొన్నారు. దాసరికి రెండోసారి పొట్టలో బెలూన్ వేసేటప్పుడే లోపం తలెత్తితే వైద్యులు దానిని సవరించి ఇంటికి పంపించారని అన్నారు. మొదటిసారి చికిత్స తీసుకున్నప్పుడు ఆయన ఎక్కువ ద్రవాహారన్నే తీసుకున్నారని తెలిపారు. కానీ, రెండోసారి బెలూన్ వేయించుకునేందుకు వెళ్లినప్పుడు మాత్రం నోటి ద్వారా సాధారణ ఆహారాన్ని తీసుకునేందుకు చికిత్స చేయించుకున్నారని తెలియజేశారు. అదే ఆయన ప్రాణం తీసిందన్నారు. సర్జరీకి వెళ్లకుండా ద్రవాహారాన్నే ఆయన తీసుకుని ఉంటే మరో పదేళ్లు బతికేవారని రేలంగి వివరించారు. కానీ, అంతా విధి రాతని, అది ఎలా తలిస్తే అలా జరుగుతుందని అన్నారు. దాసరి జీవించి ఉంటే సినీ పరిశ్రమకు అండగా ఉండి, మరింత మేలు జరిగేదని రేలంగి నరసింహారావు అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.