యాప్నగరం

టాలీవుడ్ టాప్-5 హీరోల్లో ఇద్దరు నా కస్టమర్లు: కెల్విన్

డ్రగ్స్ మాఫియా ఎంతగా విస్తరించిందో విచారణ లోతుకు వెళ్లేకొద్ది నమ్మశక్యంకాని నిజాలు వెలువడుతున్నాయి. ప్రధాన నిందితుడు వెల్లడించిన సమాచారం బట్టి ఇందులో టాలీవుడ్‌కు చెందిన మరిందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.

TNN 16 Jul 2017, 8:21 am
డ్రగ్స్ మాఫియా ఎంతగా విస్తరించిందో విచారణ లోతుకు వెళ్లేకొద్ది నమ్మశక్యంకాని నిజాలు వెలువడుతున్నాయి. ప్రధాన నిందితుడు వెల్లడించిన సమాచారం బట్టి ఇందులో టాలీవుడ్‌కు చెందిన మరిందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. తాజాగా టాలీవుడ్‌లోని ఐదుగురు టాప్ హీరోల్లో ఇద్దరు తన కస్టమర్లేనని డ్రగ్స్ దందాలో ప్రధాన నిందితుడు కెల్విన్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అతడు నుంచి మూడు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులకు వాటిలో 2,100కు పైగా కాంటాక్టులు లభించాయి. వాటిలో 100కు పైగా మొబైల్ నెంబర్లు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులవేనని పోలీసులు గుర్తించారట. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాప్-5 కథానాయకుల్లో ఇద్దరి నుంచి ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టుల వరకూ తాను డ్రగ్స్ అందజేసిన విషయం కెల్విన్ ద్వారా తెలుసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Samayam Telugu tollywood drugs scandal prime accuse kelvin reveals whose names
టాలీవుడ్ టాప్-5 హీరోల్లో ఇద్దరు నా కస్టమర్లు: కెల్విన్


తెలుగులో టాప్-5 స్థానాలు హీరోలు నటిస్తున్న చిత్రాల జయాపజయాలను బట్టి మారుతుంటాయి. దీంతో టాప్-5లోని ఆ ఇద్దరు ఎవరనే విషయం గుర్తించలేకపోతున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఈ సీనియర్ హీరోలను పక్కనబెడితే, ప్రస్తుతం టాలీవుడ్‌లో మహేష్ బాబు, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ, రానా తదితరులు టాప్ స్థానాలకు పోటీ పడుతున్నారు. తాము నటించిన సినిమాల విజయాలను బట్టి టాప్-5 నుంచి అటూ ఇటూ మారుతున్నవారే. ఇక ఈ జాబితాలో రవితేజ పేరు ఇప్పటికే డ్రగ్స్ దందాలో వెలుగులోకి వచ్చింది. ఇంకో హీరో ఎవరన్న విషయమై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఈ కేసులో రవితేజతోపాటు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కూడా సిట్ అధికారులు నోటీసులు పంపారు. ఇంకా నోటీసులు అందుకున్న వారిలో హీరో తరుణ్, నటుడు సుబ్బరాజు, గాయని గీతా మాధురి భర్త నందు, యువ హీరో తనీష్, నవదీప్, హీరోయిన్ చార్మి, ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్, కెమెరామెన్ శ్యామ్ కె. నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, శ్రీనివాసరావు ఉన్నారు. వీరంతా ఈ నెల 19 నుంచి 27 వరకు వ్యక్తిగతం విచారణకు హాజరుకావాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. ఇందులో కొందరు తమకు ఎలాంటి సంబంధం లేదని, విచారణకు హాజరవుతామని అంటున్నారు. ప్రధాన నిందితుడు కెల్విన్ దగ్గర మా నెంబర్లు ఎందుకున్నాయో అర్థం కావడంలేదని కొందరంటే, మాకు నోటీసులే అందలేని ఇంకొందరు పేర్కోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.