యాప్నగరం

నిర్మాత ఆదిత్యరామ్‌కు మాతృ వియోగం

లక్ష్మి అంత్యక్రియలు చెన్నైలోని ఆదిత్యరామ్‌ నగర్‌లో ఆదివారం నిర్వహించనున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు.

Samayam Telugu 11 Nov 2018, 5:18 pm
టాలీవుడ్ నిర్మాత, ఆదిత్యరామ్ స్టూడియోస్ అధినేత ఆదిత్యరామ్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆదిత్యరామ్ తల్లి లక్ష్మి కన్నుమూశారు. చెన్నైలో లక్ష్మి తుదిశ్వాస విడిచారని సమాచారం. లక్ష్మి అంత్యక్రియలు చెన్నైలోని ఆదిత్యరామ్‌ నగర్‌లో ఆదివారం (నవంబర్ 11వ తేదీ) నిర్వహించనున్నారు.
Samayam Telugu Adityaram


‘సందడే సందడి’, ‘ఖుషి ఖుషీగా’, ‘స్వాగతం’, ‘ఏక్‌ నిరంజన్‌’ సినిమాలకు ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆదిత్యరామ్‌ నిర్మాతగా వ్యవహరించారు. లక్ష్మి మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. నిర్మాత ఆదిత్యరామ్‌కు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.