యాప్నగరం

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై కేసు నమోదు

సినీ నిర్మాత బండ్ల గణేశ్, ఆతని సోదరుడు శివబాబుపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తమకు రావాల్సిన డబ్బులను

TNN 11 Jan 2018, 10:47 am
సినీ నిర్మాత బండ్ల గణేశ్, ఆతని సోదరుడు శివబాబుపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తమకు రావాల్సిన డబ్బులను ఇవ్వాలని అడిగినందుకు కులం పేరుతో తమని దూషించారంటూ కౌన్సిలర్ కృష్ణవేణి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కి చెందిన డాక్టర్ దిలీప్‌చంద్ర‌కి ఫరూఖ్‌నగర్ మండలం, బూర్గుల శివారులో భూముల, పౌల్ట్రీలు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు బండ్ల గణేశ్‌ ఒప్పందం చేసుకున్నారు.
Samayam Telugu tollywood producer bandla ganesh convicted in case
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై కేసు నమోదు


ఆ భూములపై బ్యాంకుల్లో అప్పటికే రుణాలు ఉండటంతో వాటిని చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒప్పందం‌లో పొందుపరిచారు. అయితే.. సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఆ భూములతో పాటు దిలీప్ చంద్ర ఇంటిని కూడా సీజ్ చేశారు. అనంతరం బండ్ల గణేశ్ సోదరుల ద్వారానే వాటిని విక్రయించారు. అయితే.. తమకు రావాల్సిన డబ్బుల కోసం డాక్టర్ దిలీప్ చంద్ర, తన భార్య కౌన్సిలర్ కృష్ణవేణి‌తో కలిసి గణేశ్ పౌల్ట్రీ ఫాం కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ గణేశ్, శివబాబు తమని దూషించారంటూ కృష్ణవేణి‌ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు గణేశ్‌ సోదరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సురేందర్‌ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.