యాప్నగరం

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కారుణ్య ఇంట విషాదం

కారుణ్య తల్లి వయసు 70 ఏళ్లు.. ఆమె కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్‌లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

Samayam Telugu 30 Aug 2020, 8:17 am
టాలీవుడ్ ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య ఇంట విషాదం నెలకొంది. కారుణ్య తల్లి జానకి అనారోగ్యంతో శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. బాలాపూర్‌ మండలం మీర్‌పేట్‌లోని త్రివేణినగర్‌లో ఆమె మృతి చెందారు. జానకి కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. ఆరోగ్యం క్షీణించడంతో శనివారం తుది శ్వాస విడిచారు. కారుణ్య తండ్రి మధు సైతం డిఫెన్స్‌లోనే పనిచేసి రిటైర్‌ అయ్యారు.
Samayam Telugu కారుణ్య ఇంట విషాదం
singer karunya


కారుణ్య తల్లి జానకి మరణవార్త తెలుసుకున్న పలువురు తమ విచారం వ్యక్తం చేశారు. పలువురు సింగర్స్ కారుణ్యకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో కారుణ్య తల్లి అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. సైదాబాద్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కారుణ్య 2006లో సోనీ టీవీ నిర్వహించిన 'ఇండియన్‌ ఐడల్‌' కార్యక్రమంలో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి ప్రముఖ గాయకుల సరసన నిలిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.