యాప్నగరం

కమెడియన్ సినిమాకు స్టార్ డైరెక్టర్లు

చిన్న చిత్రం అయినప్పటికీ ఇటీవలకాలంలో ఏ సినిమాకూ రానంత క్రేజ్ తెచ్చుకుంది. కారణం.. స్టార్ డైరెక్టర్లు అందరూ ఈ సినిమాను ప్రశంసిచడమే. త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ

TNN 13 Nov 2016, 4:02 pm
చిన్న చిత్రం అయినప్పటికీ ఇటీవలకాలంలో ఏ సినిమాకూ రానంత క్రేజ్ తెచ్చుకున్న చిత్రం 'జయమ్ము నిశ్చయమ్మురా'. సమైక్యంగా నవ్వుకుందాం అనేది ట్యాగ్ లైన్. శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఈనెల 25 విడుదలకు సిద్ధమవుతోంది.
Samayam Telugu tollywood star directors supporting jayammu nishchyammmura
కమెడియన్ సినిమాకు స్టార్ డైరెక్టర్లు




ఈ సినిమా పట్ల క్రేజ్ రావటానికి కారణం, స్టార్ డైరెక్టర్లు అందరూ ఈ సినిమాను ప్రశంసిచడమే. అంతేకాకుండా సినిమా ప్రమోషన్లు కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నారు. త్రివిక్రమ్ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్, సుకుమార్ చేతుల మీదుగా సాంగ్ టీజర్ రిలీజ్ చేయగా.. థియేట్రికల్ ట్రైలర్‌ను మరో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ విడుదల చేయనున్నారు.



ఇదే వేదికపై ప్రముఖ యువ దర్శకులు అనిల్ రావిపూడి, ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంలోని జీవా, పోసానిల ఫస్ట్‌లుక్స్ మరియు టీజర్స్ ఆవిష్కరించనున్నారు. ఇంతకుముందు ప్రవీణ్ 'తత్కాల్' ఫస్ట్‌లుక్ మరియు కృష్ణ భగవాన్ 'అడపా ప్రసాద్' ఫస్ట్‌‌లుక్ లను హీరో సునీల్ రిలీజ్ చేశారు.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌తో ఫస్ట్ లుక్స్ మరియు టీజర్స్, ట్రైలర్స్ రిలీజ్ చేయిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రబృందం, ఆడియోను ఎవరితో విడుదల చేయిస్తుందోనన్న క్యూరియాసిటి నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.