యాప్నగరం

బాత్ టబ్‌లో త్రిష పోజు!

ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ‘మోహిని’.

Samayam Telugu 17 Jul 2018, 7:16 pm
ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ‘మోహిని’. రెండేళ్ల కిందటే ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది. అయితే ఏమైందో కానీ తెరమరుగు అయ్యింది. ఇప్పుడు టీజర్‌తో ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇది వరకూ త్రిష ఒక హారర్ సినిమాలో నటించింది. దానికి తన గ్లామర్ తలుకులు అద్దింది. ఇప్పుడు ‘మోహిని’ అంటూ వస్తోంది ఈ భామ. దీనికి కూడా త్రిష అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Samayam Telugu 7


ఇప్పటికే త్రిషకు 35 యేళ్లు వచ్చేశాయి. యువ హీరోల సినిమాల్లో త్రిషకు అవకాశాలేవిప్పుడు. ఎవరైనా ముదురు హీరోలు అవకాశాలు ఇస్తేనే త్రిష సినిమాలు చేయగలుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో సోలోగా కూడా ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి ప్రయత్నమే ‘మోహిని’. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే.. త్రిష ప్రధాన పాత్రలో సినిమాలు తీయాలనుకునే వారికి ఉత్సాహం లభించగలదు.

‘మోహిని’ సినిమాకు ప్రచారం కల్పించేందుకు అందులో త్రిష స్టిల్స్ ను వెబ్‌లోకి వదిలారు దీని రూపకర్తలు. మరి త్రిష ఏ మేరకు ప్రేక్షకులను థియేటర్లను ఆకర్షించగలదో చూడాలి!

మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.