ఈమధ్య కాలంలో హారర్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అయిన త్రిష మళ్లీ మరో కొత్త హారర్ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే త్రిష నటించిన నాయకి మూవీ వచ్చే జూన్ 10వ తేదీన రిలీజ్‌కి రెడీ అవుతుండగా అదే నెల మొదటి వారంలో మోహిని పేరుతో మరో హారర్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మాధేష్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో త్రిష అర్ధ నగ్నంగా కనిపించనుందని తెలుస్తోంది. అవసరమైతే, ఈ అర్ధ నగ్న సన్నివేశాల కోసం డూప్‌ని వాడుకుందామని మేకర్స్ చెప్పినప్పటికీ.. త్రిష మాత్రం పర్ఫెక్షన్ కోసం ఆ సీన్స్ కూడా తానే చేస్తానని హామీ ఇచ్చిందట.
ప్రత్యేకంగా తెరకెక్కించనున్న ఈ అర్ధ నగ్న సన్నివేశాలతోపాటు సినిమాలోని మరికొన్ని కీలకమైన దృశ్యాల్ని మరింత సహజంగా మలిచేందుకు 'హ్యారీ పోటర్' సీక్వెల్స్‌కి పనిచేసిన విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ సహాయం తీసుకుంటున్నారు 'మోహిని' మేకర్స్. ఈ సినిమాకి సంబంధించిన చాలా భాగం షూటింగ్ సైతం థాయిలాండ్‌తోపాటు ఆసియాలోని ఇతర ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారు.