ఒకవైపు ‘అరవింద సమేత వీర రాఘవ’ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను అమితానందానికి గురి చేస్తోంది. ఈ సారి తమ అభిమాన హీరో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ విశ్వాసంతో ఉన్నారు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఈ సినిమాపై వారి అంచనాలు పతాక స్థాయికి చేరిపోయాయి. ఇప్పటికే అరవింద ట్రైలర్‌ను తమ సోషల్ మీడియా ఖాతాల్లోకి షేర్ చేసుకొంటూ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.
అదలా ఉంటే.. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన క్రిటిక్స్ మాత్రం ఇది గత సినిమాలను గుర్తు చేసేలా ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ ప్రభాస్ ‘మిర్చి’ కథాంశాన్ని పోలి ఉందనే అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. హీరోయిన్‌తో హీరో రొమాంటిక్ యాంగిల్, సొంతూర్లో హీరోకి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్, నాయనమ్మ చెప్పే శాంతి వచనం.. ఇదంతా ‘మిర్చి’ని పోలి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అలాగే ఎన్టీఆరే స్వయంగా నటించిన ‘దమ్ము’ సినిమాలో కూడా ఈ తరహా యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయని అంటున్నారు. ఈ విధంగా ‘అరవింద సమేత వీరరాఘవ’కు ఇది వరకటి ఫ్యాక్షన్, యాక్షన్ ఎంటర్ టైనర్లతో పోలిక వస్తోంది.
అయితే ఇప్పటి వరకూ వచ్చింది ఈ సినిమా ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా వస్తే, అది ఆకట్టుకుంటే.. ఈ తరహా పోలికలు దూదిపింజల్లా తేలిపోయే అవకాశం ఉంది.