యాప్నగరం

బ్రహ్మానందానికి ‘హాస్య నట బ్రహ్మ’ బిరుదు ప్రదానం

ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందానికి అరుదైన గౌరవం దక్కింది. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ ‘హాస్య నటబ్రహ్మ’ బిరుదుతో సత్కరించారు.

Samayam Telugu 11 Mar 2018, 10:26 pm
ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందానికి అరుదైన గౌరవం దక్కింది. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ ‘హాస్య నటబ్రహ్మ’ బిరుదుతో సత్కరించారు. మహబూబ్‌నగర్‌‌లో జరిగిన ‘కాకతీయ కళావైభవ మహోత్సవం’లో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి బ్రహ్మానందానికి ఈ పురస్కారాన్ని అందజేశారు. బ్రహ్మానందం ఇప్పటి వరకూ 1100లకు పైగా చిత్రాల్లో నటించారు. తనదైన హాస్యంతో తెలుగు సినీ చరిత్రలో తనదైన గుర్తింపును దక్కించుకున్నారు. సినీ కెరీర్‌‌లో చాలా అవార్డులు అందుకున్నప్పటికీ.. ‘హాస్య నట బ్రహ్మ’ పురస్కారం చాలా విశిష్టమైంద’ని బ్రహ్మానందం ఆనందం వ్యక్తం చేశారు.
Samayam Telugu tsr kakatiya kala parishath presents hasya nata brahma title to brahmanandam
బ్రహ్మానందానికి ‘హాస్య నట బ్రహ్మ’ బిరుదు ప్రదానం


నా ఆధ్యాత్మిక గురువైన టి. సుబ్బరామిరెడ్డి నన్ను ఆశీర్వదించి.. ఈ బిరుదు ఇస్తున్నామని చెప్పారు. అంతకంటే మహద్భాగ్యం ఏముందంటూ బ్రహ్మానందం ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రియ మిత్రుడు గుండు హనుమంత రావును గుర్తుకు తెచ్చుకున్నారు. జీవిత నన్ను డాడీ అని పిలుస్తుంది, రాజశేఖర్‌తో తను కలిసి రావడం నా అదృష్టమన్నారు.

‘కాకతీయ కళావైభవ మహోత్సవం’ కార్యక్రమ ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి, మాజీ కేంద్ర మంత్రి ఎస్‌.జైపాల్‌ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

జయప్రద, రాజశేఖర్‌, జీవిత, బాబుమోహన్‌, పరుచూరి గోపాలకృష్ణ, అలీ, కేథరిన్‌, శ్రద్ధాదాస్‌, పృథ్వీ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, హంసా నందినీలను ‘కాకతీయ పురస్కారాల’తో సత్కరించారు. గోరేటి వెంకన్న, కవి జంగిరెడ్డి, డాక్టర్ వంగపురం నీరజ, కపిలవాయి లింగమూర్తి, తెలుగు సాహిత్య పరిశోధకులు చిక్కా హరీశ్, న్యూస్ రీడర్ గోరంట్ల రోజా, హరికథ కళాకారిణి పద్మాలయ ఆచార్య తదితరులను కాకతీయ పురస్కారాలతో సత్కరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.