యాప్నగరం

Lakshmi Vasudevan: రూ.5 లక్షల వస్తాయని ఆశపడ్డ నటి.. ఆ తప్పు చేసి కంటతడి

తమిళ టీవీ సీరియల్ నటి లక్ష్మీ వాసుదేవన్ (Lakshmi Vasudevan) సైబర్ నేరగాళ్ల వేధింపులకు గురయ్యారు. తన తల్లి సెల్‌కు వచ్చిన మెసెజ్‌కు క్లిక్ చేయడంతో.. ఓ యాప్ డౌన్‌లోడ్ అయింది. ఆ తరువాత డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులు పెడుతూ.. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్, బంధువులకు పంపించారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 27 Sep 2022, 12:01 pm
కస్తూరి, ముత్తజగు, ఒరు ఉరుల ఒరు రాజకుమారి, తిలలంగడి వంటి తమిళ సీరియల్స్‌లో నటించి బుల్లితెరపై మంచి పేరు సంపాందిచుకున్నారు నటి లక్ష్మీ వాసుదేవన్ (Lakshmi Vasudevan). తాజా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె కన్నీటి పర్యంతమవుతూ ఎమోషనల్‌గా వీడియోలో మాట్లాడారు. తనకు తెలియకుండా చేసిన తప్పువల్ల ఇబ్బందిపడినట్లు చెప్పుకొచ్చారు.
Samayam Telugu Lakshmi Vasudevan
లక్ష్మీ వాసుదేవన్


ఆ వీడియోలో లక్ష్మీ వాసుదేవన్ ఎమోషనల్‌గా మాట్లాడారు. 'నేను ఈ విషయాన్ని వాట్సాప్‌లో నా ఫ్రెండ్స్‌ షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరో నా ఫోటోను మార్ఫింగ్ చేసి.. కొత్త నంబర్ నుంచి నాకు తెలిసిన వారందరికీ పంపించారు. నేను చేసిన తప్పును ఎవరూ చేయకూడదని ఇదంతా చెబుతున్నారు. ఇంతకు ఏం జరిగిందో మీకు చెప్పాలి. సెప్టెంబర్ 11న ఐదు లక్షల రూపాయలు గెలుచుకున్నారని మా అమ్మకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌తో పాటు ఓ లింక్ కూడా ఉంది.

నేను ఆ లింక్‌పై క్లిక్ చేశాను. దానిపై క్లిక్ చేసినప్పుడు.. ఫోన్‌లో ఓ యాప్ ఇన్‌స్టాల్ అయింది. ఆ తర్వాత నా ఫోన్‌ను హ్యాక్ ఎవరో హ్యాక్ చేశారు. ఆ విషయం నాకు అప్పుడు తెలియదు. మూడు నాలుగు రోజుల తరువాత నాకు మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. మీరు లోన్ తీసుకున్నారని.. వెంటనే లోన్ చెల్లించాలని మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. చాలా దారుణంగా మాట్లాడి నాకు వాయిస్ నోట్ పంపారు. 5 వేల రూపాయలు అప్పు కట్టకపోతే మీ ఫోటో అందరికీ పంపిస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. నేను వెంటనే హైదరాబాద్‌లోని సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాను. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.

కానీ ఇంతలో నా ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి.. నా వాట్సాప్‌లోని కొన్ని కాంటాక్ట్‌లకు పంపించారు. అందరూ ఏం జరిగిందో అని అడగటంతో ఏడుపు వచ్చింది. నా ఫ్రెండ్స్‌కు నా గురించి తెలుసు. వారికి నేను ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. కానీ ఇలాంటి తప్పు యాప్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఎదురయ్యే ఇబ్బందుల గురించి చెప్పాలి. మీరు డబ్బు గెలుచుకున్నారని తెలియని నంబర్ నుంచి మీకు సందేశం వస్తే క్లిక్ చేయకండి. తెలియకుండా ఏ యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేయవద్దు. లక్కీ డ్రా సందేశాలను నమ్మి మోసపోకండి.

సైబర్ క్రైమ్ పోలీసులు వీడియో సందేశం లేదా వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేయాలని నాకు చెప్పారు. నేను చెప్తే చాలామందికి అవగాహన కలుగుతుందన్నారు. అప్పుడే చాలా మందికి ఆ విషయం తెలిసింది. ఇలా లోన్ యాప్స్ వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటివి ఎదుర్కోవడం మహిళలకు చాలా కష్టం. ఒక్కోసారి ఒక నంబరు నుంచి మెసెజ్ వస్తుంది. IP అడ్రస్‌లు మారుస్తూ.. ఆస్ట్రేలియా, శ్రీలంక, అమెరికా, లండన్, సిడ్నీలో చూపిస్తోంది.. దీనిపై సైబర్ క్రైమ్ కసరత్తు చేస్తోంది. నాకు మీ అందరి మద్దతు కావాలి..' అంటూ లక్ష్మీ వాసుదేవన్ కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.